Sindhooram: సినిమా చూసి ఆశ్చర్యపోతారు
ABN , First Publish Date - 2023-01-23T15:50:02+05:30 IST
ఈ సినిమా కూడా ఒక నక్సల్ నేపధ్యంగా తీసిన సినిమా. "మీరు సినిమా చూసాక చాల ఆశ్చర్యపోతారు," అని ఒక్క మాటలో సినిమా గురించి చెప్పారు శివ బాలాజీ. సింగన్న అనే నక్సలైట్ పాత్ర వేస్తున్న శివబాలాజీ ఈ కథ చాల నిజ జీవిత సన్నివేశాలతో కూడినవి కూడా కనిపిస్తాయి అని చెప్పాడు
బిగ్ బాస్ విన్నర్ (Bigg Boss winner) శివ బాలాజీ (Siva Balaji), బ్రిగిడ సాగ (Brigida Saga), ధర్మ (Dharma) ముఖ్య తారాగణంగా 'సింధూరం' (Sindhooram) సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. ఇందులో శివ బాలాజీ నక్సలైట్ (Naxal backdrop story) పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఒక నక్సల్ నేపధ్యంగా తీసిన సినిమా. "మీరు సినిమా చూసాక చాల ఆశ్చర్యపోతారు," అని ఒక్క మాటలో సినిమా గురించి చెప్పారు శివ బాలాజీ. సింగన్న అనే నక్సలైట్ పాత్ర వేస్తున్న శివబాలాజీ ఈ కథ చాల నిజ జీవిత సన్నివేశాలతో కూడినవి కూడా కనిపిస్తాయి అని చెప్పాడు. "డైలాగ్స్, సన్నివేశాలు చూసి ఇవన్నీ జరిగాయి కదా అని అనుకుంటారు," అని చెప్పాడు. ఇది ఒక పీరియడ్ కథ అని, 90 లో జరిగినది అని చెప్పాడు. (It's a period story happened in 90s)
దర్శకుడు కృష్ణవంశీ (Director Krishna Vamsi's Sindhooram) ఒకప్పుడు 'సింధూరం' అనే సినిమా తీసాడు, అది కూడా నక్సల్ నేపధ్యంగానే తీసాడు. మరి ఆ సినిమాకి, ఈ సినిమాకి ఏమైనా పోలిక ఉందా అంటే, "లేదు. ఈ సినిమాలో కథని నాకు తెలిసినంత వరకు ఎవరూ ఇంతవరకు టచ్ చెయ్యలేదు," అని చెప్పాడు శివ బాలాజీ. తెలుగు చిత్రసీమలో చాలా సినిమాలు నక్సల్ నేపథ్యంలో వచ్చాయి, కానీ, 'సింధూరం' మాత్రం కచ్చితంగా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను అని చెప్తున్నాడు శివ బాలాజీ.
ఇది ఒక ఇంటెన్స్ సినిమా అని మాత్రం చెప్పగలను. "ఇందులో సోషల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. మొదటి షో సినిమా చూసాక, ఈ సినిమా గురించి, కథ గురించి అందరూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు," అని చెప్పాడు. ఎక్కువ షూటింగ్ ఫారెస్ట్ ఏరియా లో జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుడిని రియాలిటీ లోకి తీసుకు వెళుతుంది, అని నమ్మకంగా చెప్పాడు శివ బాలాజీ.