Yendira Ee Panchayati: అన్ని రకాల ఎమోషన్స్‌తో.. ఎమోషనల్‌గా టీజర్

ABN , First Publish Date - 2023-09-14T21:31:25+05:30 IST

విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత ప్రదీప్ కుమార్. ఎం తెలిపారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Yendira Ee Panchayati: అన్ని రకాల ఎమోషన్స్‌తో.. ఎమోషనల్‌గా టీజర్
Yendira Ee Panchayati Still

విలేజ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayati) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత ప్రదీప్ కుమార్. ఎం (M Pradeep Kumar) తెలిపారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి (Gangadhara T) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ విషయానికి వస్తే.. 80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో అన్ని రకాల ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, లవ్, థ్రిల్లర్ జానర్‌లను చూపించారు. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్ అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’.. ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’.. అంటూ సాగే డైలాగ్స్ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. అలాగే విలేజ్‌ బ్యాక్‌డ్రాప్, ఆర్టిస్ట్‌లు ఈ సినిమా కోసం మ్యాగ్జిమమ్ ఎఫెర్ట్ పెట్టినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. (Yendira Ee Panchayati Movie Teaser)


కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

***********************************

*CP CV Anand: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. ‘బేబీ’ టీమ్‌కు నోటీసులు.. పరారీలో హీరో!

***********************************

*Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..

***********************************

*Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?

***********************************

Updated Date - 2023-09-14T21:31:25+05:30 IST