#Dhamaka: రవి తేజ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడోచ్
ABN , First Publish Date - 2023-01-06T14:45:41+05:30 IST
ఈ వారం సినిమాలు ఏవీ లేకపోవటంతో, రవి తేజ సినిమాకి బాగా లాభించింది. 'ధమాకా' ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేసి రవితేజ ని వందకోట్ల క్లబ్ లోకి చేర్చింది.
రవితేజ మాస్ మహారాజ (Mass Maharaja Ravi Teja) పేరుకు తగ్గట్టే బాక్స్ ఆఫీస్ (Box-Office) దగ్గర సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. తాను నటించిన 'ధమాకా' (#Dhamaka) రెండో వారం లో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ వారం సినిమాలు ఏవీ లేకపోవటంతో, రవి తేజ సినిమాకి బాగా లాభించింది. 'ధమాకా' ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేసి రవితేజ ని వందకోట్ల క్లబ్ లోకి చేర్చింది. (The film collected Rs 100 crores gross and now with this Ravi Teja joined 100 crore club) ఈ సినిమా విజయం రవితేజ కి మంచి సమయంలో వచ్చింది. చాలా కాలం తరువాత హిట్ అనే పదం కోసం ఎదురుచూస్తున్న రవి తేజ కి దానికన్నా పెద్దది బ్లాక్ బస్టర్ నే వచ్చింది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది చాలా బలంగా వుంది. ఈ సంక్రాంతి సినిమాలు విడుదల అయ్యే వరకు ఈ సినిమా థియేటర్స్ లో సూపర్ గా కంటిన్యూ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇందులో కథానాయికగా నటించిన శ్రీ లీల (Sreeleela) ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లనుంది.
ఆమెకి నూటికి నూరు మార్కులు రావటమే కాకుండా, ఆమె కోసం ఎన్నో సినిమాలు ఎదురు చూస్తున్నాయి. ఆమె డాన్స్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. 'ధమాకా' తో రవితేజ కి సమయానికి సక్సెస్ రావటమే కాకుండా, శ్రీలీల కి మాత్రం అగ్ర నటీమణుల్లో ఒకరుగా చేసే అవకాశం మాత్రం ఇచ్చింది. (Sreeleela became overnight star with this film success) రావు రమేష్ (Rao Ramesh), హైపర్ ఆది (#HyperAadi) స్పూఫ్స్ (Spoofs) సినిమాకి ఇంకో హైలైట్ అని చెప్పాలి. అందులోకి 'ఇంద్ర' (#IndraSpoof) స్పూఫ్ కడుపుబ్బా నవ్వించటమే కాదు, అదే సినిమాకి ముఖ్య సన్నివేశం లా తయారయింది. ఇక పాటలు అన్నీ మాస్ కి అట్ట్రాక్ట్ చేసినా, వాటికి శ్రీ లీల చేసిన డాన్స్ ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని ఇచ్చింది. శ్రీ లీల మంచి డాన్సర్ అని ఈ సినిమాతో నిరూపించుకుంది. ఈ సినిమాకి త్రినాథ రావు నక్కిన (Director Trinadha Rao Nakkina) దర్శకుడు కాగా, రచయిత ప్రసన్న కుమార్ (#WriterPrasannaKumar) కి కూడా మంచి పేరు తీసుకు వచ్చింది.