RRR Oscar Veduka: RRR ఆస్కార్ ఫంక్షన్ చేశారు సరే.. రావాల్సిన వాళ్ళు ఎందుకు రాలేదో !

ABN , First Publish Date - 2023-04-10T12:30:46+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. ఆదివారం #TFI సాయంత్రం ఆస్కార్ విజేతలకు చేసిన #OscarAward సన్మాన కార్యక్రమంలో ఒక్క నటుడు లేక పోవటం విచిత్రం. కనీసం పరిశ్రమకి పెద్దన్నయ్య లాంటి చిరంజీవిని (Chiranjeevi) కూడా నిర్మాతల మండలి సరిగ్గా పిలవలేదని తెలిసింది. ఈ వేడుక పలు విమర్శలకు తావిచ్చింది అని అంటున్నారు

RRR Oscar Veduka: RRR ఆస్కార్ ఫంక్షన్ చేశారు సరే.. రావాల్సిన వాళ్ళు ఎందుకు రాలేదో !

ఆదివారం సాయంకాలం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆస్కార్ అవార్డు (OscarAwardWinners) గ్రహీతలు అయిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), లిరిక్ రైటర్ చంద్రబోస్ (Chandrabose) లను సన్మానించింది. ఇది ఎలా ఉందంటే చిత్ర పరిశ్రమకి చెందిన వారే ఈ చేసిన విధానాన్ని చూసి పైకి చెప్పకపోయినా, ఆఫ్ ది రికార్డు అంటూ విమరిస్తున్నారు. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలోని పాట 'నాటు నాటు' (Naatu Naatu) కి ఆస్కార్ అవార్డు (OscarAward) వచ్చిన సంగతి తెలిసిందే. అనేకమంది విమర్శించాక, తెలుగు చలన చిత్ర పరిశ్రమ (TFI) ఎట్టకేలకు ఆదివారం సాయంకాలం నాడు శిల్పకళా వేదిక లో ఈ సన్మాన సభను ఏర్పాటు చేసింది.

RRRoscarveduka1.jpg

అయితే ఎదో ఏర్పాటు చెయ్యాలి కనక చేసాం అన్న చందాన ఇది ఉందని ఒక నిర్మాత తన ఆవేదనని వ్యక్తం చేసాడు. ఎందుకంటే ఈ సన్మాన సభకి నటీనటులు ఒక్కరు కూడా కనిపించలేదు. మరి ఇందులో మూవీ ఆర్టిస్టు ఆసోసియేషన్ (MovieArtisteAssociation) ని పిలవలేదా ? మెగా స్టార్ చిరంజీవి (MegaStar Chrianjeevi) పరిశ్రమకి పెద్దన్నయ్యలా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు పిలవలేదు అని ఒక నటుడు అడిగాడు. నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, దర్శకుల సంఘం సభ్యులు కనిపించారు. మరీ నటీనటులు ఎందుకు రాలేదు ఈ సన్మాన సభకి. ఇది పరిశ్రమలో ఈరోజు ఒక చర్చగా మారింది అని తెలిసింది.

rrroscarveduka2.jpg

ఈ పాటని అమెరికాలో ప్రచారం చెయ్యడానికి ఈ 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలో నటించిన ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) లు ఇద్దరూ చాలా శ్రమించారు. ఎన్నోరోజులు అక్కడ వుండి ఈ సినిమా కోసం ఎంతో ప్రచారం చేశారు. కనీసం ఆ ఇద్దరు నటులు అయినా రావాలి కదా, మరి వాళ్ళు కూడా ఎందుకు రాలేదు. పోసాని కృష్ణ మురళి లాంటి వాళ్ళు ఎప్పుడో ఇచ్చేసిన నంది అవార్డుల మీద వార్తల్లో ఉండటం కోసం ఎదో విమర్శలు చేసాడు, మరి అతను ఎందుకు రాలేదు ఈ సన్మాన సభకి అని కూడా ఒక నిర్మాత ఆడిగాడు.

RRRoscarveduka3.jpg

ఇవనీ ఒక ఎత్తు అయితే, ఇండస్ట్రీ లో కొందరి సమాచారం మేరకు, ఈ సన్మాన సభకి నటీనటులు రాకపోవటానికి కారణం ఏంటి అంటే, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వాళ్ళు సరిగ్గా ఆహ్వానం పంపలేదని. చిరంజీవి లాంటి వ్యక్తికీ కూడా ఒక ఎస్ఎంఎస్ పంపి వూరుకున్నారని, అందుకే వల్లఏవరూ రాలేదని తెలిసింది. అందువల్లనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా రాలేదని తెలిసింది.

RRRoscarveduka4.jpg

ఏమైనా కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలుగువాళ్ళకు అవార్డులు వచ్చినప్పుడు రాజకీయాలు వదిలి మనస్ఫూర్తిగా సన్మానాలు చెయ్యాలని, లేకపోతే ఇలాగే విమర్శలకు తావిచ్చినట్టు అవుతుందని పేరు చెప్పని ఒక నిర్మాత అన్నాడు.

RRROscarveduka6.jpg

నిర్మాతల మండలి అధ్యక్షుడు కానూరి దామోదర ప్రసాద్ (Kanuri Damodara Prasad) ని ఇదే విషయమై అడగ్గా, "అందరినీ పిలిచాము. నేను పోసాని (Posani Krishna Murali), అలీ (Ali) లాంటి రాజకీయాలతో సంబంధం వున్న వ్యక్తులందరికీ ఫోన్ చేసి పిలిచాను. వాళ్ళు రాలేదు. ఇది పరిశ్రమ చేసిన సన్మానం, ఇందులో అందరూ భాగస్వాములే, ఒకరికి పిలవలేదు, పిలవాలి అనేవి ఏవీ వుండవు. అందరూ భాగస్వాములు కావాలి," అని చెప్పారు. నటీనటులు అందరూ షూటింగ్ లో బిజీ గా ఉన్నారేమో మరి, ఎందుకు రాలేదో తెలియదు అని చెప్పారు దామోదర ప్రసాద్.

Updated Date - 2023-04-10T12:33:58+05:30 IST