Tollywood Box Office: గత వారం విడుదల అయిన సినిమాల ప్రభావం ఎలా వుంది అంటే...
ABN , First Publish Date - 2023-06-05T17:22:35+05:30 IST
గత వారం మూడు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి, అందులో ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయిన సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం దగ్గుబాటి మొదటి సినిమా కూడా వుంది. అలాగే ఇంకో నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ సినిమా కూడా వుంది. ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నాయో చూద్దాం.
గత వారం మూడు సినిమాలు విడుదల అయ్యాయి, అయితే ఈ మూడు సినిమాలు చిన్న సినిమాలే అవటం ఆసక్తికరం. ఒకప్పుడు పెద్ద హిట్స్ ఇచ్చిన దర్శకుడు తేజ (DirectorTeja) ఈసారి రామానాయుడు (Ramanaidu) మనవడు, రానా దగ్గుబాటి (RanaDaggubati) తమ్ముడు అభిరాం దగ్గుబాటి (AhiramDaggubati) ని పరిచయం చేస్తూ 'అహింస' #Ahimsa అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ మొదటి రోజు మొదటి షో నుండే బాడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అందువల్ల ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఇది ప్రేక్షకులకు హింసనే మిగిల్చింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (BellamkondaSuresh) రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ (BellamkondaGanesh) నటించిన 'నేను స్టూడెంట్ సర్' (NenuStudentSir) సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా కథ కొంచెం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు. దీనికి రాఖి ఉప్పలపాటి (RakhiUppalapati) దర్శకుడు.
తెలంగాణ నేపధ్యంలో వచ్చిన ఇంకో సినిమా 'పరేషాన్' #Pareshan. ఇందులో తిరువీర్ (Thiruveer) కథానాయకుడు కాగా రూపక రోనాల్డ్ సన్ (RupakRonaldson) దీనికి దర్శకుడు. ఈ సినిమాని రానా దగ్గుబాటి బాగా ప్రమోట్ చేసాడు, కానీ ప్రేక్షకులు ఈ సినిమాని కూడా పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ సినిమాలో తాగుడు, తినుడు ఎక్కువయిందని, అందువల్ల ఈ సినిమాకి నెగటివ్ టాక్ బాగా వచ్చిందని అనలిస్ట్స్ చెపుతున్నారు. అయితే మొదటి రోజు ఈ సినిమా హైదరాబాద్ లో కొంచెం నడిచింది అన్నారు కానీ, సినిమా అయితే పోవటం లేదు అనే చెపుతున్నారు అనలిస్ట్స్.
ఇలా గత వారం విడుదల అయిన సినిమాలన్నీ పరాజయం అవటంతో, విజయ్ ఆంథోనీ (VijayAntony) నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన 'బిచ్చగాడు 2' #Bichagadu2 కి బాగా ప్లస్ అయింది. ఈ సినిమా కలెక్షన్స్ రెండో వారం కూడా బాగున్నాయి అనే అంటున్నారు. విజయ్ ఆంటోనీ కి ఎప్పటి నుండో చూస్తున్న విజయం ఈ సినిమాతో వచ్చింది.
ఇక 'మేమ్ ఫేమస్' #MemFamous సినిమా కూడా క్రిటిక్స్ కి నచ్చకపోయినా, ఆ సినిమా కి వైవిధ్యమైన ప్రమోషన్స్ చెయ్యడం, మహేష్ బాబు (MaheshBabu) లాంటి సూపర్ స్టార్ ఆ సినిమా కోసం మాట్లాడటం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. ఈ సినిమా కంటెంట్ అంత బాగో లేకపోయినా తెలంగాణ నేపధ్యం కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లోనూ, మరికొన్ని తెలంగాణ ప్రాంతాల లోనూ ఈ సినిమా పరవాలేదని చెపుతున్నారు.