DimpleHayatiVsDCPRahul: ఎవరికీ భయపడేది లేదు, ఇది కేవలం హరాస్మెంట్: డింపుల్ లాయర్
ABN , First Publish Date - 2023-05-23T16:35:40+05:30 IST
డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య కేసు ఇప్పుడు ఒక టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సెల్లార్ లో ట్రాఫిక్ డివైడ్ చెయ్యడానికి ఉపయోగించే పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు ఉండటం పబ్లిక్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలాగే డింపుల్ తాజా గా ట్వీట్ చేసి తాను ఎవరికీ అధికారికంగా ఈ కేసు గురించి ఇంతవరకు మాట్లాడలేదని చెప్పింది.
నటి డింపుల్ హయతి #DimpleHayati మీద జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ JubileeHillsPoliceStation లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే TrafficDCPRahulHegde కారును డింపుల్ తన కారుతో ఢీ కొట్టిందని, అలాగే కాలితో కారుని తన్నింది అని రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా అది నమోదు చేశారు.
అయితే ఈలోపు ఈ కేసులో చాలా ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. అసలు ఆ అపార్ట్మెంట్ లోకి బయట రోడ్ లా మీద ట్రాఫిక్ డివైడ్ కి ఉపయోగించే పెద్ద పెద్ద సిమెంట్ ట్రాఫిక్ దిమ్మలు ఎలా వచ్చాయి, ఎందుకు అక్కడ పెట్టారు అన్న విషయం పబ్లిక్ కి ఆసక్తిగా కనపడుతోంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ మీద ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఉపయోగించే ప్లాస్టిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అపార్ట్మెంట్ సెల్లార్ లో కనపడ్డాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కోసం వన్నీ అపార్ట్మెంట్ లో ఎలా వచ్చాయి అని చాలామంది పబ్లిక్ అడుగుతున్నారు. #DimpleHayatiVsTrafficDCP
ఇవన్నీ పక్కన పెడితే, డింపుల్ హయతి లాయర్ ఇది కేవలం డింపుల్ ని హారాస్మెంట్ చెయ్యడం కోసం పోలీసులు తమ పవర్ ని ఉపయోగిస్తున్నారని చెప్పాడు. సిసిటివి వీడియోలో డింపుల్ కేవలం ఆ ప్లాస్టిక్ డబ్బా లాటి దాన్ని కాలితో తన్నిందని అదేమీ విరాగాలేదని, అయినా ఆమె ఒక సెలబ్రిటీ అని, చేతితో వాటిని పక్కన ఎలా పెడుతుంది అని, అందుకే కాలితో తన్నింది అని అదేమీ పెద్ద విషయం కాదని డింపుల్ లాయర్ చెప్పాడు.