Music Director Chakri Death: ఆరోజు రాత్రి ఎదో జరిగింది, అన్నయ్య గుర్తు ఒక్కటికూడా లేకుండా చేశారు అంటున్న చక్రి తమ్ముడు
ABN , First Publish Date - 2023-04-01T14:58:15+05:30 IST
చక్రి 2014 లో చాలా చిన్న వయసులో అంటే 39 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. అప్పట్లో చక్రి మరణం ఒక పెద్ద వివాదం గా మారింది, అలాగే చక్రి ఆస్తి గురించి కూడా ఆ కుటుంబం అప్పట్లో వార్తల్లో వుండింది. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్ళీ చక్రి మరణం గురించి చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ 'పరారీ' ప్రచారం లో భాగంగా మాట్లాడేడు
కొన్ని రోజుల క్రితం 'పరారీ' (Parari) సినిమా విడుదల అయింది. ఆ సినిమాకి సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ (Mahith Narayan). ఇతను మరెవరో కాదు, స్వయానా దివంగత సంగీత దర్శకుడు చక్రి (Music director Chakri) కి తమ్ముడు. ఈ సినిమా ప్రచారం లో భాగంగా మహిత్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అన్నయ్య గురించిన సంగతులు కూడా చెప్పాడు. అన్నయ్య చనిపోయిన రోజు ఎదో జరిగిందని మాత్రం ఈరోజుకి నమ్ముతున్నాం అని అంటాడు మహిత్.
చక్రి చనిపోయాక అతను గుర్తులు ఒక్కటి కూడా లేకుండా చేశారని అంటున్నాడు మహిత్. తనను తమ్ముడిలా కాకుండా, స్వంత కొడుకుల చక్రి అన్నయ్య చూసుకున్నాడని చెపుతూ, ఇప్పుడు ఒక మ్యూజిక్ (Music director Chakri) స్టూడియో పెట్టుకున్నట్టు చెప్పాడు మహిత్. చాలామంది అన్నయ్య స్టూడియో మహిత్ కి ఇచ్చేశారని చెపుతూ ఉంటారని, అందులో నిజం లేదని చెప్పాడు మహిత్. "అన్నయ్య స్టూడియో ఒక అద్దె ఇంట్లో ఉండేది. అన్నయ్య చనిపోయాక అందులో వస్తువులు అన్నీ ఎవరో తీసుకొని, కొన్ని పాత సోఫా సెట్ లు లాంటివి కింద పడేసి కాల్చేశారు. అది నేనే కాల్చాను అని నా మీద కేసు కూడా పెట్టారు," అని చెప్పుకొచ్చాడు మహిత్.
అయితే తరువాత నిజం తెలిసిందని, అన్నయ్య గుర్తుగా కనీసం ఒక ఫోటో కూడా మిగల్చలేదని చెప్పాడు మహిత్. అన్నయ్య నెల మాసికం అప్పుడు ఫోటో కావలసి వచ్చినప్పుడు నెట్ లో డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకున్నాం అని చెప్పాడు మహిత్. అమ్మే, చక్రికి విషం ఇచ్చిందని లేనిపోనివన్నీ ఆరోపించారని, కన్నతల్లి ఆలా చేస్తుందా, ఎన్నటికీ చెయ్యదు అని చెప్పాడు మహిత్. చక్రి 2014 లో చాలా చిన్న వయసులో అంటే 39 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించాడు. అప్పట్లో చక్రి మరణం ఒక పెద్ద వివాదం గా మారింది, అలాగే చక్రి ఆస్తి గురించి కూడా ఆ కుటుంబం అప్పట్లో వార్తల్లో వుండింది. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్ళీ చక్రి మరణం గురించి చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ 'పరారీ' ప్రచారం లో భాగంగా చెప్పాడు. చక్రి బతికి ఉండగానే మహిత్ ని సంగీత దర్శకుడిగా చాలా ప్రోత్సహించాడు.
అన్నయ్య చక్రి చనిపోయాక పోస్ట్ మార్టం చెయ్యమంటే ఎందుకు చెయ్యలేదు అని, ఆరోజు రాత్రి మాత్రం ఎదో జరిగిందని, అది ఏంటి అని తెలిస్తే మా బతుకులు ఇలా ఉండవని చెప్పాడు మహిత్. ఇప్పుడు 'సి' మ్యూజిక్ స్టూడియో తన స్వంతంగా మొదలెట్టానని చెప్పుకొచ్చాడు. అన్నయ్య పని చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవీ రాలేదని, ఏవో చిన్న చిన్నవి మిగిల్చారని చెప్పాడు. చక్రి చనిపోయాక అతని భార్య శ్రావణి (Chakri wife Sravani) అమెరికాలో సెటిల్ అయిందని, ఆమె కొంత ల్యాండ్స్ అమ్ముకుందని, ఇంకా కొన్ని ఆమె పేరు మీద రాయించుకుందని, ఇంకా కొన్ని స్థలాల మీద కోర్టు స్టే ఇచ్చిందని, అందువల్ల తమ కుటుంబానికి చక్రి ఆస్తి ఒక్క నయాపైసా కూడా దక్కలేదని చెప్పారు మహిత్. ఇప్పుడు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయని చెపుతున్నాడు మహిత్.