WaltairVeerayya: తగ్గేదే లే! రికార్డు బద్ధలు కొట్టే దిశగా చిరు
ABN , First Publish Date - 2023-01-23T14:16:46+05:30 IST
చిరంజీవి నటించిన (MegaStar Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య' (#WaltairVeerayya) రెండో వారం కూడా అస్సలు ఎక్కడా తగ్గలేదు. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు అసలు ఏమాత్రం తగ్గడం లేదు.
చిరంజీవి నటించిన (MegaStar Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య' (#WaltairVeerayya) రెండో వారం కూడా అస్సలు ఎక్కడా తగ్గలేదు. బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు అసలు ఏమాత్రం తగ్గడం లేదు. చిరంజీవి తన స్టామినా ఏంటో మరోసారి చూపించి ఈ సినిమా ఓవర్ ఆల్ రన్ లో రికార్డ్స్ బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఎవరు ఊహించని విధంగా (క్రిటిక్స్) బాహుబలి, 'ఆర్.ఆర్.ఆర్' సినిమాల తరువాత తెలుగులో అత్యంత కలెక్షన్స్ కురిపించే సినిమాగా 'వాల్తేరు వీరయ్య' ముందుకు వెళుతోంది. ఇప్పటికే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా సుమారు 25 కోట్ల లాభాలు ఆర్జించి పెట్టింది. ఇవన్నీ ఒక్క ధియేటరికల్ హక్కుల ద్వారా వచ్చినవి మాత్రమే. ఇంక ఓ.టి.టి, (OTT and Satillite rights) శాటిలైట్ హక్కులు కూడా చూసుకుంటే నిర్మాతలకి అసలు డబ్బులే డబ్బులు ఈ సినిమా వలన. మైత్రి మూవీ మేకర్స్ (Mytrhi Movie Makers) ఈ సినిమాకి నిర్మాతలు.
చిరంజీవి నటించిన ఇంతకు ముందు సినిమాలు కొన్ని కలెక్షన్స్ కొంచెం తగ్గేసరికి చిరంజీవి పని అయిపోయిందిరా అని ఇటు చిత్ర పరిశ్రమలోనూ అటు బయటా అనుకుంటున్న సమయంలో 67 ఏళ్ల చిరంజీవి తన ప్రతాపాన్ని చూపించి, తాను కుర్ర నటులకు ఏమి తీసిపోని అంటూ 'వాల్తేరు వీరయ్య' తో తన తడాఖా ఏంటో చూపించారు. అసలు తగ్గేదే లే! అని మరోసారి అందరికి ఒక ఛాలెంజ్ విసిరారు. రెండో వారం లో మామూలుగా ఎటువంటి సినిమా అయినా కొంచెం కలక్షన్స్ తగ్గుతుంది, కానీ 'వాల్తేరు వీరయ్య' మటుకు ఊహించని విధంగా కలెక్షన్స వర్షం కురిపించింది. ఇందులో మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు. రెండో సగం లో వస్తాడు రవితేజ. శృతి హాసన్ (Shruti Haasan) కథానాయికగా నటించింది. పాత చిరంజీవిని ఈ సినిమాలో దర్శకుడు బాబీ కొల్లి చూపించి అభిమానులకు కనివిందు చేసాడు. ఇందులోని పాటలకు చిరంజీవితో పాటు చిన్నారులు కూడా డాన్స్ చెయ్యడం ఇంకో పెద్ద విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెంత వసూల్ చేస్తుందో చూడాలి. పది రోజులకు గాని ఒక్క తెలుగులోనే సుమారు రూ. 117 కోట్లు షేర్ సంపాదించి 25 కోట్ల లాభాలు ఇప్పటికే ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఈ సినిమా జనవరి 13న విడుదల అయింది.