Chiranjeevi: తదుపరి చిత్రం అబ్బాయిగారితోనే!

ABN , First Publish Date - 2023-01-09T18:56:47+05:30 IST

మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ నుంచి సినిమా వచ్చి ఐదేళ్లు కావొస్తుంది. చిరంజీవి కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నం 150’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆయన తదుపరి సాయిధరమ్‌ తేజ్‌తో ‘ఇంటెలిజెంట్‌’ తీశారు.

Chiranjeevi: తదుపరి చిత్రం అబ్బాయిగారితోనే!

మాస్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ (VInayak next movie) నుంచి సినిమా వచ్చి ఐదేళ్లు కావొస్తుంది. చిరంజీవి కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నం 150’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆయన తదుపరి సాయిధరమ్‌ తేజ్‌తో ‘ఇంటెలిజెంట్‌’ తీశారు. ఈ చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో మాత్రం మరో సినిమాకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఆయన తదుపరి చిత్రం చిరంజీవితోనే ఉంటుందని, దాని కోసం బలమైన కథ కోసం కసరత్తులు చేస్తున్నారనీ చాలా కాలంగా గాసిప్పులు వినిపిస్తున్నాయి. వి.వి.వినాయక్‌ (V.V.Vinayak) ఛత్రపతి పూర్తి కాగానే చిరు చిత్రం మీదే దృష్టి పెట్టబోతున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం చిరంజీవి కూడా బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ సెట్స్‌ మీదుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. కానీ ఆ చిత్రం గురించి ప్రస్తుతం ఎలాంటి ప్రస్తావన లేదు. ‘భోళా శంకర్‌’ తర్వాత చిరంజీవి (Chiranjeevi) వి.వి.వినాయక్‌తోనే సినిమా చేయడానికి ఉత్సహం చూపిస్తున్నారని సమాచారం. వినాయక్‌ కూడా ప్రస్తుతం అదే పని మీద ఉన్నారని టాక్‌, వీరిద్దరిది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. పైగా చిరు-వినాయక్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినాయక్‌ చిరుని అన్నయ్యలా భావిస్తే.. ఆయన మాత్రం వినాయక్‌ను అబ్బాయిగారు అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే!

గతంలో చిరంజీవి-వినాయక్‌ కాంబినేషన్‌లో ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నం 150’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయిన సంగతి తెలిసిందే! చిరంజీవి స్టార్‌డమ్‌కు తగిన కథ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ విజయం ఖాయమే అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Untitled-2.jpg

Updated Date - 2023-01-09T18:56:49+05:30 IST