Vijay Deverakonda: కొత్త సినిమా ఆరంభం అయింది !

ABN , First Publish Date - 2023-06-14T13:43:00+05:30 IST

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఈరోజు పూజా ముహూర్తంతో లాంచ్ అయింది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక, ఆమె కూడా పూజ కార్యక్రమానికి హాజరు అయింది. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు

Vijay Deverakonda: కొత్త సినిమా ఆరంభం అయింది !
Mrunal Thakur and Vijay D at the launch of #VD13 film

'గీత గోవిందం' #GeethaGovindam అనే పెద్ద హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ (VijayDeverakonda), దర్శకుడు పరశురామ్ పెట్ల (ParasuramPetla), సంగీత దర్శకుడు గోపి సుందర్ (GopiSundar), ఈ ముగ్గురూ మళ్ళీ ఇంకో సినిమాకి కలుస్తున్నారు. దిల్ రాజు (DilRaju) నిర్మించే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు అధికారికంగా దిల్ రాజు ఆఫీస్ లో ప్రారంభం అయింది. విజయ్ దేవరకొండ కి ఇది 13వ సినిమా కాగా, ఇందులో 'సీతా రామం' #SitaRamam లో నటించిన మృణాల్ ఠాకూర్ (MrunalThakur) కథానాయికగా నటిస్తోంది.

vijayd6.jpg

ఈరోజు జరిగిన పూజ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, నిర్మాతలు రాజు, శిరీష్ లో పాల్గొన్నారు. #VD13 చాలా సింపుల్ గా జరిగే ఈ కార్యక్రమానికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి (ShyamPrasadReddy) హాజరు అయ్యారు. మృణాల్ ఠాకూర్ కి ఇది మూడో సినిమా. మొదటి సినిమా 'సీతా రామం' లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది మృణాల్. తరువాత నాని (Nani) సినిమాలో కూడా చేస్తోంది, ఇప్పుడు ఇది తెలుగులో ఆమెకి మూడో సినిమా.

ముహూర్తపు సన్నివేశం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మీద చిత్రీకరించారు. ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు పెడతామని చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలియచేసారు. దర్శకుడు పరశురామ్ కూడా విజయ్, గోపి సుందర్ తో మళ్ళీ పనిచెయ్యడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసాడు.

Updated Date - 2023-06-14T13:43:00+05:30 IST