Vijay Deverakonda: సంక్రాంతి బరిలో విజయ్, పరశురామ్ సినిమా కూడా వుంది

ABN , First Publish Date - 2023-09-27T10:33:11+05:30 IST

సినిమా ప్రేక్షకులకు రానున్న సంక్రాంతి పండగ చాలా ఆసక్తికరంగా వుండబోతోంది. మహేష్ బాబు, నాగార్జున, రవితేజ ఇలా చాలామంది సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ సినిమా కూడా పోటీలో వుంది.

Vijay Deverakonda: సంక్రాంతి బరిలో విజయ్, పరశురామ్ సినిమా కూడా వుంది
Vijay Deverakonda

రానున్న సంక్రాంతి పండగ సినిమా ప్రియులందరికీ కనువిందు కాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram సంక్రాంతికి విడుదలవుతుంది అని చెప్పారు. అలాగే నాగార్జున (AkkineniNagarjuna) నటిస్తున్న 'నా సామి రంగా' #NaaSaamiRanga కూడా సంక్రాంతికి విడులా అని ముందే చెప్పేసారు. అలాగే రమేష్ వర్మ (RameshVarma) దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ సినిమా 'హనుమాన్' #HanuMan కూడా సంక్రాంతికె విడుదల అని చెప్పారు. రవి తేజ (RaviTeja) సినిమా 'ఈగిల్' #Eagle కూడా సంక్రాంతి బరిలో వుంది అని వార్త.

gunturkaram-maheshbabu.jpg

ఇలా ఇన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ (VijayDeverakonda) సినిమా కూడా సంక్రాంతి బరిలోకి వస్తోందని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు (DilRaju) అధికారికంగా ఈరోజు ప్రకటించారు. దీనికి పరశురామ్ (ParasuramPetla) దర్శకుడు కాగా, ఇందులో మృణాల్ ఠాకూర్ (MrunalThakur) కథానాయకురాలిగా చేస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు ఒక అధికార ప్రకటన విడుదల చేస్తూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది అని, వీడీ 13గా #VD13 పిలుస్తున్న ఈ సినిమా నుంచి నిర్మాతలు ఆ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ను ఇవాళ వెల్లడించారు.

nagarjuna-poster1.jpg

ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని అలాగే రానున్న సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.

Updated Date - 2023-09-27T10:33:11+05:30 IST