Rashmika Mandanna : విజయ్‌కు.. రష్మిక సమాధానం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-09-28T17:01:02+05:30 IST

విజయ్‌ దేవరకొండను ఉద్దేశిస్తూ నటి రష్మిక చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ ఎప్పటికీ ది బెస్ట్‌ అని ట్వీట్‌లో పేర్కొన్నారు రష్మిక. ఇంతకీ ఆమె ట్వీట్‌కు కారణం ఏంటంటే..

Rashmika Mandanna : విజయ్‌కు.. రష్మిక సమాధానం ఏంటంటే..

విజయ్‌ దేవరకొండను ఉద్దేశిస్తూ నటి రష్మిక చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ ఎప్పటికీ ది బెస్ట్‌ అని ట్వీట్‌లో పేర్కొన్నారు రష్మిక. ఇంతకీ ఆమె ట్వీట్‌కు కారణం ఏంటంటే.. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక కీలక పాత్రధారులుగా నటిందచిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్‌’ చిత్రం టీజర్‌ను రణబీర్‌ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం విడుదల చేశారు.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. టీజర్‌ విడుదల అనంతరం దీనిని ఉద్దేశిస్తూ విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. టీజర్‌ తనకెంతో నచ్చిందని ట్వీట్‌లో చెచుతూ ‘‘మై డార్లింగ్స్‌ సందీప్‌ రెడ్డి వంగా, రష్మిక.. అలాగే నాకెంతో ఇష్టమైన బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అని రాసుకొచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ‘‘థ్యాంక్యూ విజయ్‌ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌’’ అని రిప్లై ఇచ్చారు. విజయ్‌- రష్మిలకు సంబంధించిన ఏ విషయమైన క్షణాల్లో వైరల్‌ అవుతుందనే సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ ట్వీట్‌ కూడా అలాగే వైరల్‌ అవుతోంది.

Animal-Rashmika.jpg

నిర్మాత నాగవంశీ కూడా ‘యానిమల్‌’ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘వైలెంట్లీ ఎక్స్‌ప్లోజివ్‌!! సందీప్‌.. వైలెన్స్‌ అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తానంటూ గతంలో నువ్వు చెప్పినట్టుగానే ఈ టీజర్‌లో చూపించావు. రణ్‌బీర్‌ కళ్లల్లోని ఆ తీవ్రత చూస్తుంటే డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు బ్లాస్ట్‌ అయ్యేలా ఉన్నాయి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-09-28T17:09:40+05:30 IST