Vijay Devarakonda : మిలియన్ల ఫాలోయర్లు.. విజయ్ క్రేజ్ వేరయా!
ABN , First Publish Date - 2023-11-27T17:11:48+05:30 IST
విజయ్ దేవరకొండకు సంబంధించి ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతే వేగంగా ట్రెండ్ అవుతుంటాడు కూడా. అర్జునరెడ్డి చిత్రంతో పాపులర్ అయిన విజయ్ గీత గోవిందంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మరింత స్వింగ్‌లోకి వచ్చాడు.
విజయ్ దేవరకొండకు సంబంధించి ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతే వేగంగా ట్రెండ్ అవుతుంటాడు కూడా. అర్జునరెడ్డి చిత్రంతో పాపులర్ అయిన విజయ్ గీత గోవిందంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మరింత స్వింగ్‌లోకి వచ్చాడు. తదుపరి ‘టాక్సీ వాలా’ తదితర చిత్రాలు ఫర్వాలేదు అనిపించినా, ‘లైగర్’ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా విజయ్ క్రేజ్ ఏమి తగ్గలేదు. తాజాగా ఆయన నటించి ‘ఖుషి’ ఓ మాదిరిగా ఆడింది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్నారు. విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. 2018 మార్చి 7న విజయ్ ఇన్‌స్టా ఖాతా తెరిచారు. తాజాగా 20 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోల జాబితాలో విజయ్ చేరిపోయాడు. దీనిపట్ల విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! అందులో విజయ్ ‘ఐరనే వంచాలా ఏంటి?’ అని చెప్పే డైలాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ స్పై థ్రిల్లర్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. ఈ రెండు చిత్రాల తర్వాత రవి కిరణ్ కోలాతో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘యుద్థం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.