IconStar: వేణు శ్రీరామ్ ఐకాన్ స్టార్ తో కాదు, నితిన్ తో చేస్తున్నాడు

ABN , First Publish Date - 2023-06-22T18:50:43+05:30 IST

ఆమధ్య ఎప్పుడో దర్శకుడు వేణు శ్రీరామ్ 'ఐకాన్' అనే సినిమా అల్లు అర్జున్ తో ప్రకటించారు. కానీ ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు, ఆ సినిమా లేదు అని పరిశ్రమలో అన్నారు. ఇప్పుడు వేణు శ్రీరామ్ నితిన్ తో చేస్తున్నాడు, మరి కథ అదేనా...

IconStar: వేణు శ్రీరామ్ ఐకాన్ స్టార్ తో కాదు, నితిన్ తో చేస్తున్నాడు
Nithiin

దర్శకుడు వేణు శ్రీరామ్ (VenuSriram) 'ఐకాన్' (Icon) అనే సినిమా అల్లు అర్జున్ (AlluArjun) తో చెయ్యాల్సి వుంది, కానీ ఆ ప్రాజెక్ట్ లేదనే చెప్పారు. అయితే దాని మీద అనధికారికంగా ఏమీ ప్రకటన ఇవ్వలేదు కానీ, ఆ సినిమా అయితే లేదు అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వేణు శ్రీరామ్ అదే సినిమాని నితిన్ తో చేస్తున్నాడు అని తెలిసింది. దిల్ రాజు (DilRaju) దీనికి నిర్మాత.

nithiin3.jpg

వేణు శ్రీరామ్ కథ రెడీ చేసుకున్నాడు, నితిన్ కి వినిపించాడు, అతను కూడా ఒకే అన్నాడు అని తెలిసింది. వెంటనే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ని కూడా అప్పుడే రెడీ చేసుకుంటున్నట్టుగా కూడా తెలిసింది. ఈ సినిమా అధికారికంగా లాంచ్ చేసి షూటింగ్ కూడా త్వరలో మొదలెట్టాలని నిర్ణయించారని తెలిసింది. అయితే ఇది 'ఐకాన్' సినిమా స్టోరీ కాదు అని చెప్తున్నారు కానీ, ఆ కథనే చిన్న చిన్న మార్పులు చేసి నితిన్ కి సూట్ అయేట్టు చేసారు అని తెలిసింది.

venusriram.jpg

నితిన్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీ గా వున్నాడు. దర్శకుడు వక్కంతం వంశీ (VakkanthamVamsi) తో ఒక సినిమా షూటింగ్ లో ఉండగా, వెంకీ కుడుముల (VenkyKudumula) దర్శకత్వంలో ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయికగా చేస్తోంది, మైత్రి మూవీ మేకర్స్ (MythriMovieMakers) ప్రొడ్యూస్ చేస్తున్నారు. వక్కంతం వంశీ తో చేస్తున్న సినిమాలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా చేస్తోంది. ఇలా వరస సినిమాలతో మంచి కథలు, దర్శకులతో నితిన్ ముందుకు వెళుతున్నట్టుగా తెలిసింది.

Updated Date - 2023-06-22T18:50:43+05:30 IST