Indian 2: కమల్ హాసన్ చిత్రంలో విలన్‌గా వెన్నెల కిశోర్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్

ABN , First Publish Date - 2023-03-01T12:57:12+05:30 IST

‘ఇండియన్ 2’ (Indian 2).. శంకర్ (Shankar), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Indian 2: కమల్ హాసన్ చిత్రంలో విలన్‌గా వెన్నెల కిశోర్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్
Vennela Kishore

‘ఇండియన్ 2’ (Indian 2).. శంకర్ (Shankar), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘ఇండియన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘భారతీయుడు’. అయితే గతేడాది పట్టాలెక్కిన ఈ మూవీ షూటింగ్ వివిధ సమస్యల కారణంగా చాలా నెమ్మదిగా నడుస్తోంది. అయితే.. ఇదే తరుణంలో ఈ మూవీ క్యాస్టింగ్ గురించి రోజుకో కొత్త వార్త వస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

‘ఇండియన్ 2’లో మొత్తం ఏడుగురు ప్రతి నాయకులు ఉండనున్నట్లు కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అందులో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఒకరని వార్తలు వచ్చాయి. అందులో ఇప్పటివరకూ కిషోర్ ఇంతవరకూ చేయని పాత్రని చేయబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై తాజాగా ఈ కమెడియన్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

ఓ న్యూస్ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలను ట్యాగ్ చేస్తూ.. ‘ఏంటి కాకా ఇది నిజామా’ అంటూ ఓ నెటిజన్ కిషోర్‌ని ప్రశ్నించాడు. దీనికి రిప్లై‌గా ట్వీట్ చేసిన కిషోర్.. ‘ఇండియన్ 2 లో లేను.. పాకిస్తాన్ 3లో లేను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో సూపర్‌గా సమాధానం చెప్పావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-01T12:59:55+05:30 IST