Venkatesh to Ravi Teja: ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు’.. భలే మార్చేశారుగా!

ABN , First Publish Date - 2023-03-15T21:13:13+05:30 IST

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) డ్యాన్స్ చేసిన పాటకి రవితేజ (Ravi Teja) డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే..

Venkatesh to Ravi Teja: ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు’.. భలే మార్చేశారుగా!
Ravi Teja and Venkatesh

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) డ్యాన్స్ చేసిన పాటకి రవితేజ (Ravi Teja) డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అందులోనూ రవితేజ ఇప్పుడు హిట్ ట్రాక్‌పై ఉన్నాడు. రవితేజలోని డిఫరెంట్ షేడ్స్‌ని చూపిస్తూ.. క్రియేటివ్ దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) రూపొందించిన ఈ చిత్రంలోని మూడవ సింగిల్‌ ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు’ (Veyyinokka Jillala Varaku) లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. అప్పట్లో ఓ ఊపు ఊపిన ఈ పాట.. ఇప్పుడు కూడా విన్న వింటనే.. సరికొత్త ఫీల్‌ని ఇస్తోంది.

ఎందుకంటే అప్పట్లో కుర్రకారుని ఉర్రూతలూగించిన పాట ఇది. విక్టరీ వెంకటేష్, విజయశాంతి (Vijayashanthi) హీరోహీరోయిన్లుగా నటించిన ‘సూర్య IPS’ (Surya IPS) చిత్రంలోని పాట ఇది. అప్పటి సాంగ్‌ని ఇప్పుడు సరికొత్తగా రీమిక్స్ చేసి వదిలారు ‘రావణాసుర’ మేకర్స్. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తన అద్భుతమైన కంపోజిషన్‌తో అందరినీ 80వ దశకంలోకి తీసుకెళ్లారు. రెట్రో స్టయిల్‌లో సాగే ఈ కొత్తపాటలో కొన్ని ఫాస్ట్ బీట్‌లు, రవితేజ క్రేజీ డ్యాన్స్‌లు కన్నుల పండువగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ నుండి సెట్స్ వరకు రెట్రో లుక్ అనుభూతిని (retro look and feel) ఇవ్వడానికి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాటలో మేఘా ఆకాష్ కూడా కనిపించారు. లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetharama Sastry) సాహిత్యం అందించిన ఈ పాటను ప్రస్తుత రీమిక్స్ వెర్షన్‌ను అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) ఆలపించగా.. శేఖర్ మాస్టర్ (Shekar Master) కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Ravi-Teja.jpg

రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరో సుశాంత్ (Sushanth) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures), ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ బ్యానర్స్‌పై (RT Teamworks) అభిషేక్ నామా (Abhishek Nama), రవితేజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథని, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-15T21:13:15+05:30 IST