Veera Simha Reddy: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఆగిపోయిన షో!
ABN , First Publish Date - 2023-01-12T16:41:12+05:30 IST
భారతీయ సినిమాలు ప్రపంచ వేదికలపై సత్తాను చాటుతుంటే అభిమానులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దేశానికి చెడ్డ పేరును తీసుకువస్తున్నారు.
భారతీయ సినిమాలు ప్రపంచ వేదికలపై సత్తాను చాటుతుంటే అభిమానులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దేశానికి చెడ్డ పేరును తీసుకువస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైంది. ఓవర్సీస్‌లోను ప్రీమియర్స్ వేశారు. కానీ, కొన్ని చోట్ల బాలయ్య అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో మూవీ షోస్‌కు బ్రేక్ పడ్డాయి.
వర్జీనియాలోని ఓ థియేటర్‌లో వీరసింహా రెడ్డి సినిమాను ప్రదర్శించగా ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అభిమానులు గాల్లో కాగితాలను ఎగురవేస్తూ తమ అభిమానాన్ని చూపించారు. సినిమా హాలును చెత్త కుప్పలా మార్చేశారు. దీంతో థియేటర్ మెనేజర్ వచ్చి ఫ్యాన్స్‌ను హెచ్చరించారు. తెలుగు సినిమాలను గతంలో ప్రదర్శించినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నారు. ఇటువంటి చర్యలను సమర్థించమన్నారు. అందువల్ల అభిమానులందరు థియేటర్ విడాలని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరూ షేర్ చేసుకుంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుందని కొంత మంది నెటిజన్స్ పోస్ట్‌లు పెట్టారు. సినిమాను మధ్యలోనే ఆపేయడంతో ప్రేక్షకులపై మరికొంతమంది సానుభూతిని వ్యక్తం చేశారు.