Varun Tej marriage: పెళ్లి కూతురు ఆమెనా?
ABN , First Publish Date - 2023-01-31T18:13:00+05:30 IST
కరోనా, లాక్‌డౌన్ సమయంలో చాలామంది తెలుగు సినిమా స్టార్లు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. రానా, నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలు ఓ ఇంటి వారయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఇప్పుడు దృష్టి నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌పై పడింది.
కరోనా, లాక్‌డౌన్ సమయంలో చాలామంది తెలుగు సినిమా స్టార్లు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. రానా, నితిన్, నిఖిల్ వంటి యంగ్ హీరోలు ఓ ఇంటి వారయ్యారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఇప్పుడు దృష్టి నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌పై (Varun tej) పడింది. మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ (Varun tej konidela marriage) పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆయన ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే విషయంపై నాగబాబు (Nagababu about varun tej marriage) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు.
‘‘త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుంది. ఈ విషయాన్ని వరుణ్ చెబుతాడు. అమ్మాయి ఎవరనేది కూడా వరుణ్ చెబుతాడు. ఇప్పుడే నేనేమీ చెప్పలేను. పెళ్లి తర్వాత తను వేరే ఇంట్లో ఉంటాడు. మేం వేరే ఉంటాం. ఎందుకంటే నా బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం అలవాటు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా మా బాండింగ్ మాత్రం ఎప్పుడూ బలంగానే ఉంటుంది’ అని అన్నారు
అయితే పెళ్లి ఎప్పుడు, కాబోయే కోడలు గురించి నాగబాబు ఏ వివరాలు చెప్పలేదు కానీ...వరుణ్ కో హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే అతనఉ పెళ్లాడబోతున్నాడని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. గతంలో హీరోయిన్ లావణ్యా త్రిపాఠీతో వరుణ్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరి ఇప్పుడు వరుణ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్నారు.