Varun Lavanya marriage: ఇటలీకి పయనమవుతున్న మెగా కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2023-10-27T12:05:00+05:30 IST

ఇటలీ లో నవంబర్ 1న జరగబోయే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లికి వధూవరులు అయిన వరుణ్, లావణ్యలు ఇద్దరూ కలిసే ఇటలీ కి పయనం అయ్యారు. మెగా కుటుంబం కూడా ఈ వివాహానికి ప్రయాణసన్నాహాలు చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళతారు, అసలు వెళతారా లేదా అన్నది ఇంకా తెలియదు అని అంటున్నారు.

Varun Lavanya marriage: ఇటలీకి పయనమవుతున్న మెగా కుటుంబ సభ్యులు
Lavanya Tripathi and Varun Tej

మెగాబ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్యల (LavanyaTripathi) వివాహం ఇటలీ లో జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1 వ తేదీన జరగనున్న ఈ వివాహానికి పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు అయిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ఈరోజు హైదరాబాద్ నుండి ఇటలీ కి పయనం అయ్యారు. వీరితో పాటు నిహారిక కొణిదెల (NiharikaKonidela) కూడా వున్నారు. అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇటలీకి పయనం అవుతున్నారని తెలిసింది.

lavanyatripathi4.jpg

వరుణ్ తేజ్, లావణ్యలు ఎప్పటినుండో ప్రేమలో వున్నా అధికారికంగా మాత్రం కొన్ని నెలల క్రితమే తెలిసింది. నిశ్చితార్ధం కూడా కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో జరిగింది. ఇప్పుడు పెళ్లి మాత్రం ఇటలీ లో చెయ్యాలని నిశ్చయించు కున్నారు. ఈ వివాహానికి దగ్గర కుటుంబ సభ్యులు, కొంతమంది మిత్రులు మాత్రమే హాజరు అవుతారని తెలిసింది. వివాహం అయిన తరువాత హైదరాబాద్ లో చిత్రపరిశ్రమలో అతిథిల కోసం నవంబర్ 5న ఒక రెసెప్షన్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.

మెగా కుటుంబ సభ్యులు (MegaFamily) అందరూ చిరంజీవి (Chiranjeevi) కుటుంబం, అల్లు అరవింద్ (AlluAravind) కుటుంబంతో సహా అందరూ ఈ వివాహానికి హాజరు కానున్నారు అని తెలిసింది. అందుకనే వైష్ణవ తేజ్ (VaishnavTej) సినిమా 'ఆదికేశవ' #Aadikeshav నవంబర్ 10న విడుదలవుతున్నా ప్రచారాలు కోసం ముందుగానే ఇంటర్వ్యూ లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అతను కూడా ఈ వివాహ వేడుకలో బిజీగా ఉంటాడని తెలిసింది.

Updated Date - 2023-10-27T12:40:00+05:30 IST