#VarunTej: హిందీ లోకి అరంగేట్రం చేయనున్న వరుణ్ తేజ్

ABN , First Publish Date - 2023-01-04T14:42:04+05:30 IST

ఈమధ్య చాలామంది తెలుగు నటులు హిందీ సినిమాల్లో ఆరంగేట్రం చేస్తున్నారు. లేదా వాళ్ళ సినిమాలు పాన్ ఇండియా (Pan India cinema) సినిమాలుగా కథలు తయారుచేసుకొని అన్ని భాషల్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఇంకో నటుడు హిందీ లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు.

#VarunTej: హిందీ లోకి అరంగేట్రం చేయనున్న వరుణ్ తేజ్

ఈమధ్య చాలామంది తెలుగు నటులు హిందీ సినిమాల్లో అరంగేట్రం చేస్తున్నారు. లేదా వాళ్ళ సినిమాలు పాన్ ఇండియా (Pan India cinema) సినిమాలుగా కథలు తయారుచేసుకొని అన్ని భాషల్లోకి విడుదల చేస్తున్నారు. అడివి శేష్ (Adivi Sesh), విజయ్ దేవరుకోండ (Vijay Deverakonda) లాంటి వాళ్ళు హిందీ సినిమాల్లో ఆరంగేంట్రం చెయ్యగా, 'ఆర్ఆర్ఆర్' (RRR), 'కె.జి.ఎఫ్' (KGF), ఇంకా ఈమధ్యనే విడుదల అయిన 'కార్తికేయ 2' (Karthikeya 2), 'కాంతారా' (Kantara) లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి అందులో నటించే నటులను పాన్ ఇండియా నటులుగా చేసాయి.

varun-tej1.jpg

ఇప్పుడు అదే బాటలో ఇంకో నటుడు హిందీ లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అతను మరెవరో కాదు, మెగా ఫ్యామిలీ (Mega Family) నుండి వచ్చిన వరుణ్ తేజ్(Varun Tej). తెలుగులో మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తున్న ఈ యువ నటుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఒక హిందీ సినిమా చేస్తున్నాడు. (Varun Tej is all set to debut in Hindi) ఇది ఎయిర్ ఫోర్స్ ప్రధానాంశంగా వస్తున్న సినిమా అని తెలిసింది. (This film is an Air Force backdrop story) ఈ సినిమా హిందీ లోనే కాకుండా, తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా విడుదల అవుతోంది. దీనికి శక్తి (Director Shakti) అనే తను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

manushi1.jpg

ఈ సినిమా కథ ఒక నిజ సంఘటన (Based on true story) ఆధారంగా తెరకెక్కుతోంది అని కూడా తెలిసింది. ఇందులో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Miss World Manushi Chhillarr) కథానాయికగా నటిస్తోంది అని కూడా తెలిసింది. వరుణ్ తేజ్ తో ఇంతకు ముందు 'ఘని' (Ghani) సినిమా నిర్మించిన వాళ్ళీ ఈ పాన్ ఇండియా సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. వరుణ్ తేజ్ ఇప్పుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) తో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు, అది ఈమధ్యనే చాలా భాగం లండన్ లో పూర్తి అయిందని కూడా తెలిసింది.

Updated Date - 2023-03-03T17:23:45+05:30 IST