Gandeeva Dhari Arjuna: యాక్ష‌న్ మోడ్‌లో మెగా ప్రిన్స్..

ABN , First Publish Date - 2023-03-06T22:52:03+05:30 IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ (Mega Prince Varun Tej) యాక్ష‌న్ మోడ్‌లోకి దిగితే ఎట్టుంటదో తెలుసునా? తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ‘గాంఢీవ‌ధారి అర్జున’ (Gandeeva Dhari Arjuna). ఈ సినిమా

Gandeeva Dhari Arjuna: యాక్ష‌న్ మోడ్‌లో మెగా ప్రిన్స్..
Gandeeva Dhari Arjuna Movie Shooting Spot

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ (Mega Prince Varun Tej) యాక్ష‌న్ మోడ్‌లోకి దిగితే ఎట్టుంటదో తెలుసునా? తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ‘గాంఢీవ‌ధారి అర్జున’ (Gandeeva Dhari Arjuna). ఈ సినిమా న్యూ షెడ్యూల్ యుఎస్ఎ (USA)లో జ‌రుగుతోంది. ‘గ‌రుడ వేగ’ (Garuda Vega) ఫేమ్, స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇదే విషయం తెలుపుతూ.. తాజాగా ఓ పిక్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఫారిన్ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. ముసోరిలో పిక్చ‌ర్‌స్క్వేర్ లొకేష‌న్ల‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇటీవ‌ల మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన స్ట్రైకింగ్ గ్లింప్స్, టైటిల్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. అద్భుత‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్‌ (BVSN Prasad), బాపినీడు (Bapineedu) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్వీసీసీ (SVCC) ప‌తాకంపై తెర‌కెక్కుతోంది ఈ సినిమా. వ‌రుణ్‌తేజ్ ఇందులో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా నటిస్తున్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది ఈ చిత్రంలోని మెయిన్ థీమ్.

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక తాజాగా వదిలిన పిక్‌లో.. మిలిట‌రీ ఔట్‌ఫిట్‌లో వ‌రుణ్‌తేజ్ (Varun Tej) లుక్ చూసిన వారు అద్భుతంగా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రానికి మిక్కీ.జె. మేయ‌ర్‌ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

Updated Date - 2023-03-06T22:52:04+05:30 IST