Varalakshmi Sarathkumar: ఇకపై అలా చేయను!
ABN , First Publish Date - 2023-01-10T16:07:49+05:30 IST
బోల్డ్ పాత్రలకు, కథానాయికా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు వరలక్ష్మీ. శరత్‌కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె తండ్రి బ్యాగ్రౌండ్‌తో కాకుండా స్వయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
బోల్డ్ పాత్రలకు, కథానాయికా ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు వరలక్ష్మీ(Vara lakshmi sarathkumar). శరత్‌కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె తండ్రి బ్యాగ్రౌండ్‌తో కాకుండా స్వయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె దక్షిణాది అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజగా తెలుగులో యశోద చిత్రంతో అలరించారామె. ప్రస్తుతం వీరసింహారెడ్డిలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మీ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. (No more glam roles)
‘‘చిత్ర పరిశ్రమలో నా గురువు బాల. ఆయన దర్శకత్వంలో నేను నటించిన సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను గ్లామర్ పాత్రలకు సూట్ కానని నా అభిప్రాయం. ఆ తరహా పాత్రలు చేయడానికి చాలామంది తారలు ఉన్నారు. ఇకపై నేను అలాంటి పాత్రలు చెయ్యను. నెగటివ్ షేడున్న పాత్రలో నటంచడం నాకు ఇష్టం. ప్రస్తుతం అదు చేస్తున్నా’’ అని వరలక్ష్మీ అన్నారు.