V Vijayendra Prasad: అలాంటి చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డ్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-04-10T19:44:05+05:30 IST
కళాకారుల కృషిని, నటనను గౌరవిస్తూ.. ప్రభుత్వం ఇచ్చే ‘నంది’ పురస్కారాల (Nandi Awards) సంస్కృతి చాలా కాలంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ‘నంది అవార్డు’ల సంస్కృతికి
కళాకారుల కృషిని, నటనను గౌరవిస్తూ.. ప్రభుత్వం ఇచ్చే ‘నంది’ పురస్కారాల (Nandi Awards) సంస్కృతి చాలా కాలంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ‘నంది అవార్డు’ల సంస్కృతికి పునర్ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Pratani Ramakrishna Goud). తెలంగాణ ప్రభుత్వం (Telangana) సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ (Telangana Film Chamber Of Commerce) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ (TFCC Nandi Awards South India 2023) వేడుకలను దుబాయ్ (Dubai)లో ఘనంగా నిర్వహించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ బ్రోచర్‌ను సోమవారం ఫిలించాంబర్‌లో ప్రముఖ రచయిత, ఎంపీ వి విజయేంద్రప్రసాద్ (V Vijayendra Prasad) చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్ (K. K. Senthil Kumar)ను ఘనంగా సన్మానించారు.
పలువురు ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో వి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ని.. మళ్లీ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే.. మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. (V Vijayendra Prasad Speech at TFCC Nandi Awards Event)
అనంతరం డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Pratani Ramakrishna Goud) మాట్లాడుతూ... ‘‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్2021, 22 సంవత్సరాలకుగానూ ఈ సంవత్సరం అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఈ అవార్డ్స్ ఫంక్షన్ దుబాయ్‌లో గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దుబాయ్ ప్రిన్స్ (Dubai Prince) చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం. 2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రముఖులతో ఏర్పాటు అయిన కమిటీ మెంబర్స్ చిత్రాలను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ప్రకటిస్తాం. దుబాయ్ ప్రిన్స్ డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ డేట్ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందూ రామకృష్ణ గౌడ్ సాహసాన్ని మెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది
*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం
*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..
*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!
*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు
*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు
*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్