Pawan kalyan: కొన్ని అనుబంధాలు ఎప్పటికీ మారవు!

ABN , First Publish Date - 2023-07-03T09:29:39+05:30 IST

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ (Mythri movie makers) ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది. అది పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ గురించి. ఏప్రిల్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించినుంది. ఈమేరకు నిర్మాణ సంస్థ అప్‌డేట్‌ ఇచ్చింది. ‘మరోసారి చరిత్రను తిరగరాద్దాం’ అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది.

Pawan kalyan: కొన్ని అనుబంధాలు ఎప్పటికీ మారవు!

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ (Mythri movie makers) ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేసింది. అది పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (UstaadBhagatSingh) గురించి. హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ‘గబ్బర్‌సింగ్‌’ విడుదలైన పదకొండేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించినుంది. ఈమేరకు నిర్మాణ సంస్థ అప్‌డేట్‌ ఇచ్చింది. ‘మరోసారి చరిత్రను తిరగరాద్దాం’ అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. ‘‘త్వరలోనే ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలు కానుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి పర్యవేక్షణలో ఓ భారీ సెట్‌ను సిద్థం చేస్తున్నాం. త్వరలోనే ఆ సెట్‌లో పవన్‌కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని తెలిపింది. ఈ అప్‌డేట్‌తోపాటు మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేసింది. అప్పట్లో ‘గబ్బర్‌సింగ్‌’(Gabbar singh)-‘ ఇప్పుడు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌లో పవన్‌కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. పవన్‌ - హరీశ్‌ మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. ‘కొన్ని విషయాలు, అనుబంధాలు ఎప్పటికీ మారవు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్రేజీ అప్‌డేట్‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. (UstaadBhagatSingh update)

Untitled-1.jpg

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా, శ్రీలీలాకథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు.

Updated Date - 2023-07-03T10:54:16+05:30 IST