Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కాదంటూ ట్రోలింగ్... యువ దర్శకుడు ట్వీట్‌తో క్లారిటీ!
ABN , First Publish Date - 2023-04-08T00:23:46+05:30 IST
గబ్బర్‌సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబో సెట్ కావడానికి 11 ఏళ్లు పట్టింది. తాజాగా వీరిద్దరి కలయికలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం రూపొందుతోంది.
గబ్బర్‌సింగ్ (Gabbari singh Combo repeat) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్ (Pawan kalyan)– హరీశ్ శంకర్ (Harish shankar) కాంబో సెట్ కావడానికి 11 ఏళ్లు పట్టింది. తాజాగా వీరిద్దరి కలయికలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం రూపొందుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ చిత్రబృందం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన (ustaad bhagath singh) ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఉస్తాద్ ఊచకోత షురూ’ అంటూ పవన్‌కల్యాణ్ కుర్చీలో కూర్చుని ఒక చేత్తో టీ గ్లాస్, మరో చేత్తో గన్ పట్టుకున్న ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతే స్థాయిలో ట్రోల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో ఉన్నది పవన్‌కల్యాణ్ కాదని, దర్శకుడు హరీశ్ శంకర్ అలా గెటప్ వేసుకుని ఫొటో షూట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే హరీశ్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్రానికి సంబంధించిన ఎవరూ స్పందించలేదు. కానీ ఓ యువ దర్శకుడు మాత్రం స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘నేషనల్ అవార్డ్ అందుకున్న ‘కలర్ ఫొటో’ (colour Photo) చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ *sandeep raj Tweet) ట్వీట్‌తో నెటిజన్లకు సమాధానం చెప్పారు.
‘‘ఈ పోస్టర్ ఫొటోషూట్ జరిగినప్పుడు నేను ఆ సెట్‌లోనే ఉన్నాను. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ పవన్‌కల్యాణ్‌గారికి డైరెక్ట్‌గా చూశాను. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మరచిపోలేని అనుభూతి’’ అలంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు హరీశ్ శంకర్‌కు థ్యాంక్స్ చెప్పారు. సందీప్ రాజ్ ట్వీట్‌తో పోస్టర్ వివాదానికి బ్రేక్ పడినట్లు అయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.