Ustaad Bhagat Singh : నాన్‌స్టాప్‌ పవర్‌ప్యాక్డ్‌ సీన్స్‌తో...

ABN , First Publish Date - 2023-09-14T10:34:24+05:30 IST

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం తాజా షెడ్యూల్‌ ప్రారంభమైంది. పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో సందడి చేస్తున్నారు. ఈ విషయాన్ని చెబుతూ మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.

Ustaad Bhagat Singh : నాన్‌స్టాప్‌ పవర్‌ప్యాక్డ్‌ సీన్స్‌తో...

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustaad Bhagat singh) చిత్రం తాజా షెడ్యూల్‌ ప్రారంభమైంది. పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో సందడి చేస్తున్నారు. ఈ విషయాన్ని చెబుతూ మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. పోలీస్‌ గెటప్‌లో సెట్‌లో అడుగుపెడుతున్న పవన్‌కల్యాణ్‌ ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న పవన్‌కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌తో తాజా షెడ్యూల్‌ మొదలైంది.

Untitled-1.jpg

నాన్‌స్టాఫ్‌గా సాగే ఈ షెడ్యూల్‌లో పవర్‌ప్యాక్డ్‌ సీన్స్‌ తెరకెక్కించబోతున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సెట్లో పవన్‌తో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పవన్‌ కల్యాణ్‌తో తనది అపరిమిత బంధం అని పేర్కొన్నారు. ఇంతకుమించి పవన్‌ కల్యాణ్‌ను ఏం అడగగలం అని అన్నారు.   మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-14T13:22:38+05:30 IST