Upasana Konidela: బాధ పడ్డా.. బలంగా నిలబడ్డా.. వాటిని జయించా!

ABN , First Publish Date - 2023-04-02T13:51:37+05:30 IST

వృత్తి, వ్యాపారాల దృష్ట్యా ఉపాసన గొప్ప అడ్మినిస్ట్రేటర్‌ అని ఆమె గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు.

Upasana Konidela:  బాధ పడ్డా.. బలంగా నిలబడ్డా.. వాటిని జయించా!

వృత్తి, వ్యాపారాల దృష్ట్యా ఉపాసన గొప్ప అడ్మినిస్ట్రేటర్‌ అని ఆమె గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. కుటుంబ పరంగా బాధ్యతాయుతమైన కోడలని చిరంజీవి(Chiranjeevi), అన్‌ కండీషనల్‌ లవ్‌కు. పని పట్ల ప్రణాళికకు ఉపాసన (Upasana konidela) కేరాఫ్‌ అని, ధైర్యానికి మారుపేరు అని రామ్‌చరణ్‌ (Ram charan) పొగుతుడూ ఉంటారు. ఇన్ని మంచి గుణాలున్నా ఆమె కూడా పెళ్లైన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు. ముంబైలో ఓ మీడియాతో మాట్లాడి ఉపాసన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. చరణ్‌తో రిలేషన్‌ గురించి కూడా మాట్లాడారు.

‘‘రామ్‌చరణ్‌ నేనూ కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయమయ్యాం. (Upasana konidela about Love story) పరిచయమైనప్పటి నుంచి తను నన్ను ఏదో ఒక విషయంలో ఛాలెంజ్‌ చేస్తూనే ఉండేవాడు. నేను కూడా తనకి ఛాలెంజ్‌ చేసేదాన్ని. అలా, మేమిద్దరం మరింత దగ్గరయ్యాం.. మా పనుల్లో ఒక్కో మెట్టు ఎక్కాం. మా మధ్య ప్రేమ మొదలైంది. ప్రాక్టికల్‌గా ఆలోచించడం మా ఇద్దరికీ కామన్‌గా ఉన్న అలవాటు. ‘నువ్వు ప్రేమలో పడలేదు.. ప్రేమలో ఎదుగుతున్నావు’ అని చరణ్‌ నాతో చెప్పాడు. ఆ మాట విని ఎంతో సంతోషించా. ఆ మాట చాలా ఆలోచనలో పడేసింది. తర్వాత చరణ్‌ చెప్పిన మాట నిజమేననిపించింది. ప్రతిరోజూ జీవిత భాగస్వామి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను అంతే. నా ఆంటీ, సోదరి మా పెళ్లి విషయంలో కీలకపాత్ర పోషించారు. ఎందుకంటే మా ఇద్దరివి భిన్నమైన కుటుంబ నేపథ్యాలు. నమ్మకం, ప్రశంసలు, పలు సందర్భాల్లో కాంప్రమైజ్‌ అవుతూ మా బంధాన్ని బలపరుచుకున్నాం. అనుకూలత అనేది బంధానికి కీలకం అని చరణ్‌ నుంచి తెలుసుకున్నా’’ అని అన్నారు.

1.jpg

‘‘చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్‌ చేస్తూనే ఉన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ ఇలాంటివి ఎదుర్కొన్నవారే. శరీరాకృతి, బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా పలు విషయాల్లో విమర్శలు తప్పవు. పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, బాగా లావుగా ఉన్నానని, డబ్బు కోసమే చరణ్‌ నన్ను పెళ్లి చేసుకున్నాడని ఎంతోమంది విమర్శించారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లపై కామెంట్లు చేయాలనుకోవడం లేదు. అలా కామెంట్‌ చేసిన వాళ్ల గురించి నేను ఒకటే అనుకున్నా. వాళ్లకు నా గురించి ఏమీ తెలియదని. అందుకే వాళ్లు అలా మాట్లాడి ఉండొచ్చు. ఈ పదేళ్లల్లో వారికి నా గురించి తెలిసింది. ఇప్పుడు వాళ్లకు నాపై అభిప్రాయం మారింది. విమర్శలను తీసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ట్రోల్స్‌ వచ్చాయని నేను ఎప్పుడు కుంగిపోలేదు. కానీ బాధ పడ్డా. బలంగా నిలబడ్డా. వాటిని జయించా. ఇప్పుడు నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఇప్పుడు నేనొక ఛాంపియన్‌లా భావిస్తా. ఎందుకంటే ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ నన్ను ధైర్యవంతురాలిని చేశాయి’’ అని ఉపాసన చెప్పారు. రామ్‌చరణ్‌, ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. త్వరలో వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. (Ramcharan Game Changer)

Updated Date - 2023-04-02T16:54:12+05:30 IST