MegaPrincess: రామ్ చరణ్, ఉపాసన ఇంటి దగ్గర పాపతో ఫోటో వైరల్

ABN , First Publish Date - 2023-06-24T19:16:23+05:30 IST

రామ్ చరణ్, ఉపాసనల లిటిల్ ప్రిన్సెస్ కి తమ ఇంటి దగ్గర ఆహ్వానిస్తూ పెట్టిన బోర్డు, దాని దగ్గర ఆ దంపతులు ఇద్దరూ, తమ పాపతో పోజు ఇచ్చిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించి రిప్లై కూడా ఇచ్చింది.

MegaPrincess: రామ్ చరణ్, ఉపాసన ఇంటి దగ్గర పాపతో ఫోటో వైరల్
Ram Charan, Upasana Kamineni with their little princess

గత కొన్ని రోజుల నుండి మెగా ప్రిన్సెస్ #MegaPrincess అన్న హేష్ టాగ్ బాగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ (RamCharan), ఉపాసన (UpasanaKamineni) దంపతులకు మంగళవారం తెల్లవారుజామున పాప పుట్టింది. ఆమెని మెగా ప్రిన్సెస్ #MegaPrincess అంటూ మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi), తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. మీడియా అంతా హాస్పిటల్ లో ఆ పాపను చూడటానికి, అలాగే రామ్ చరణ్, ఉపాసనలకు విషెస్ చెప్పడానికి మెగా కుటుంబం అంతా వచ్చారు.

నిన్న రామ్ చరణ్, ఉపాసన, పాపతో కలిపి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. వెళ్లేముందు ఆసుపత్రిలో అక్కడి ఉద్యోగులు ఒక పెద్ద సంబరంగా చేశారు. ఎందుకంటే ఉపాసన కుటుంబం అపోలో హాస్పిటల్ ని చూసుకుంటున్నారు కాబట్టి, ఆమెకి రామ్ చరణ్ కి, పాపకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఘనంగా సంబరాలు చేశారు.

ramcharan-upasana-baby.jpg

అలాగే పాప పేరు కూడా సంప్రదాయంగా ఎప్పుడు పెట్టాలో అప్పుడు చెప్తాము అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ. అయితే ఈరోజు ఉపాసన ఇంకో ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. అందులో ఆమె అందరికీ థాంక్స్ చెపుతూ, తన పాపను పట్టుకొని, అలాగే రామ్ చరణ్ తన కుక్క పిల్లను పట్టుకొని పోజ్ ఇచ్చారు. ఇది వాళ్ళింటి దగ్గర పాపకి వెల్కమ్ చెపుతున్నప్పుడు తీసినది.

ఉపాసన పెట్టిన ఈ ఫోటోకి అగ్ర నటి రకుల్ ప్రీత్ సింగ్ (RakulPreetSingh) స్పందించింది. ఆమె ఉపాసనకు కంగ్రాట్స్ అని చెపుతూ, పాప ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని అందరూ ఆశీర్వదించాలి అని చెప్పింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయింది.

Updated Date - 2023-06-24T19:16:23+05:30 IST