Upasana Konidela : భర్త గురించి సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-03-07T17:00:21+05:30 IST

‘ఎలాంటి సందర్భంలోనైనా నేను చరణ్‌(Ram charan)కు శాయశక్తుల సాయం చేస్తుంటాను. తను కూడా అంతే. ఈ ఏడాది ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వృత్తి పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.

Upasana Konidela : భర్త గురించి సంచలన వ్యాఖ్యలు!

‘‘ఎలాంటి సందర్భంలోనైనా నేను చరణ్‌(Ram charan)కు శాయశక్తుల సాయం చేస్తుంటాను. తను కూడా అంతే. ఈ ఏడాది ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వృత్తి పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈ ఏడాది తనదే’’ అని అన్నారు ఉపాసన (Upasana Konidela). సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే ఆమె సందర్భం దొరకిన ప్రతిసారి తన భర్త రామ్‌చరణ్‌పై ప్రశంసల వర్షం (*Upasana happy with Ram charan) కురిపిస్తుంటారు. ఆయనతో ప్రత్యేకతల్ని చెబుతుంటారు. ప్రతి విషయంలోనూ చెర్రీ వెంటే ఉంటారు. ఆర్‌ఆర్‌ఆర్‌’ 9RRR)టీంతో కలిసి ఎన్నో సందర్భాల్లో విదేశాల్లో సందడి చేశారు ఉపాసన. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ (Golden Globe) అవార్డు వచ్చినప్పుడు కూడా ఉపాసన చరణ్‌తో కలిసి సందడి చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ రామ్‌చరణ్‌ సాధిస్తున్న విజయాల గురించి చెప్పారు. ‘‘నేను వేసే ప్రతి అడుగులోనూ రామ్‌ చరణ్‌ నాకు మద్దతుగా నిలిచారు. నేను కూడా చరణ్‌కు అన్ని విషయాల్లో అండగా ఉంటా. ‘నాటు నాటు’ (natu natu)సాంగ్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లినప్పుడు, షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్న సమయంలోనైనా ఇలా ఏ విషయంలోనైనా చెర్రీకి నేను వెన్నంటే ఉన్నాను. కెరీర్‌ పరంగా ఆయన ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఆయనదే’’ అని ఆనందం వ్యక్త పరిచారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అమెరికాలో ఉన్నారు. అక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రీ రిలీజ్‌ కావడంతో ప్రేక్షకుల మధ్య సరదాగా గడుపుతున్నారు.

Updated Date - 2023-03-07T17:00:52+05:30 IST