Salaar Ticket Rates :  రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ 

ABN , Publish Date - Dec 19 , 2023 | 08:29 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘సలార్‌’ (Salaar) చిత్రం టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల  ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్  ఇచ్చాయి. అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలకు, భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌  ధరలు పెంచుకునేలా తెలుగు  రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే.

Salaar Ticket Rates :  రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ 



ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన ‘సలార్‌’ (Salaar) చిత్రం టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల  ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్  ఇచ్చాయి. అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలకు, భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల విషయంలో నిబంధనల మేరకు మొదటివారం టికెట్‌  ధరలు పెంచుకునేలా తెలుగు  రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్‌’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ విజ్ఞప్తి చేయగా సినిమా విడుదలైన రోజు  నుంచి వారంపాటు అంటే డిసెంబర్‌ 28 వరకు టికెట్‌ ధరలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో  మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్‌ థియేటర్లలో రూ.65 పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. నైజాంలో 20 థియేటర్లలో మాత్రమే అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షోకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో సలార్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శనలకు అనుమతినిచ్చింది. సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని పంపిణీదారులకు వెసులబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీలోనూ అనుమతి..
సలార్‌ టికెట్‌ ధరను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. ఏపీలో రూ.40 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన పది రోజుల వరకే పెరిగిన ధరలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే  అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు.

తెలంగాణలో ప్రత్యేక షోలకు అంగీకారం దొరకడంతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర ప్రభాస్‌ అభిమానులు పెద్ద సంఖ్యలు క్యూకట్టారు.


Updated Date - Dec 19 , 2023 | 09:27 PM