Game Changer: రామ్ చరణ్ సినిమా సాంగ్ లీక్, ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీస్

ABN , First Publish Date - 2023-11-06T14:20:37+05:30 IST

'గేమ్ చెంజర్' సినిమా నుండి ఒక పాట లీకు అయిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు దీని మీద ఫిర్యాదు చెయ్యగా, సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసినట్టుగా తెలిసింది.

Game Changer: రామ్ చరణ్ సినిమా సాంగ్ లీక్, ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీస్
Ram Charan, director Shankar and producer DIl Raju

ఈమధ్య చాలా సినిమాల పాటలు ముందుగానే లీక్ అయిపోయి, సాంఘీక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా మహేష్ బాబు (MaheshBabu) సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా నుండి ఒక పాట లీక్ అవగా, గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (RamCharan), శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ #GameChanger నుండి కూడా ఒక పాట లీక్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DilRaju) ఈ భారీ బ‌డ్జెట్‌ సినిమాని నిర్మిస్తున్నారు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' #RRR హిట్ తరువాత, రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో 'గేమ్ ఛేంజ‌ర్‌'పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

gamechanger5.jpg

గేమ్ చేంజర్ సినిమా నుంచి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో పాటు సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి పని చేస్తున్న ఈ సినిమా నుంచి పాట‌ను అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఈ మూవీ నుంచి థమన్ సంగీతం అందించిన 'జరగండి' పాట దీపావళికి విడుదల చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-11-06T14:21:25+05:30 IST