SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ABN , First Publish Date - 2023-01-15T15:27:35+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు.

SSMB28: మహేశ్, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు, సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కొంత కాలంగా బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపాడు. రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ షూటింగ్‌ జనవరి 18 నుంచి ప్రారంభం కానుందని సూర్య దేవర నాగవంశీ చెప్పాడు. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) హీరోయిన్స్‌గా నటిస్తున్నారని పేర్కొన్నాడు. టైటిల్‌ను ఫిక్స్ చేయలేదన్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుందన్నాడు. ఒకరు ఫస్ట్ హీరోయిన్, మరొకరు సెకండ్ హీరోయిన్ కాదని వెల్లడించాడు. ఇద్దరు హీరోయిన్సే అని తెలిపాడు. ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ విషయాలను సూర్య దేవర నాగవంశీ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ ధర చెల్లించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికీ సంబంధించి మరొక చెప్పుకోదగ్గ విశేషం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో ఇప్పటి వరకు ఐటం సాంగ్స్ లేవు. తొలి సారిగా ఈ మూవీలో పెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ స్పెషల్ సాంగ్‌ను రష్మిక మందన్నా (Rashmika Mandanna) చేయనుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2023-01-15T16:49:42+05:30 IST