SSMB28: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు లుక్..

ABN , First Publish Date - 2023-03-26T19:19:45+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు.

SSMB28: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న మహేశ్ బాబు లుక్..

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ (SSMB28) అని వ్యవహరిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలిపారు.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘రైనింగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త మాస్ అవతారంలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ చిత్రంతో వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్స్‌లో కలుస్తారు’’ అని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్‌లో జరిగే యాక్షన్ సన్నివేశమని తెలుస్తోంది. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్‌తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్‌గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ కు ‘అమరావతి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌28’ లో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎస్‌ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రి విక్రమ్ కలసి పని చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. అందువల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ రూ.80కోట్లకు పైగా చెల్లించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T19:31:50+05:30 IST