AkhilAkkineni: 'ఏజెంట్' ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇవే అంటున్నారు
ABN , First Publish Date - 2023-04-29T12:25:50+05:30 IST
అయ్యగారి సినిమా 'ఏజెంట్' బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడినట్టు కనపడుతోంది. మొదటి రోజు బాగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవటం తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబటం కష్టం అనే అంటున్నారు. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వటానికి కారణాలు ఏంటంటే...
అఖిల్ అక్కినేని #AkhilAkkineni, సురేందర్ రెడ్డి #SurenderReddy కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' #Agent నిన్న విడుదల అయింది. ఈ సినిమా ఎంతో హైప్ తో విడుదల అయింది, ఈ సినిమా కోసం అఖిల్ అక్కినేని ఎంతో కష్టపడ్డాడు. తన ఫిజిక్ ని రెండు సంవత్సరాలు ఒకేలా ఉంచుకోవటం కోసం కఠినమైన ఆహార నియమ నిబంధనలను పాటించాడు. ఎందుకంటే ఈ సినిమా సుమారు రెండు సంవత్సరాల పైనే పట్టింది షూటింగ్ పూర్తి కావటానికి.
ఈ సినిమా క్రిటిక్స్ ఎవరికీ నచ్చలేదు, టాక్ కూడా బాగోలేదు అని బాగా స్ప్రెడ్ అయింది. ఈ సినిమా రూ. 80 కోట్ల బడ్జెట్ తో తీశారు అని పరిశ్రమలో టాక్. అలాగే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా చాలా తక్కువగా అంటే రూ. 35 తో 40 కోట్లకు అమ్మారు. అయితే మొదటి రోజు కలెక్షన్స్, ఈ సినిమా టాక్ రెండూ చూస్తే కనక 'ఏజెంట్' #Agent బాక్స్ ఆఫీస్ #BoxOffice దగ్గర నిలబడటం కష్టమే అంటున్నారు అనలిస్ట్స్.
ఈ సినిమా ఇంతలా నెగటివ్ టాక్ రావటానికి ఇవే కారణాలు అంటున్నారు:
దర్శకుడు సురేందర్ రెడ్డి, కథ మీద దృష్టి పెట్టకుండా ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల మీదే దృష్టి పెట్టాడు అనిపిస్తోంది. ఎందుకంటే అవి బాగానే వున్నాయి కానీ, కథలో మెయిన్ పాయింట్ మిస్సయింది.
మమ్మూట్టి #Mammootty పాత్రని సినిమాలో అఖిల్ ని డామినెటే చేసే విధంగా తీర్చి దిద్దాడు. అసలు మమ్మూట్టి ఎంట్రీ సీన్ ఎలా ఇచ్చాడు అంటే, ఒక మాస్ యాక్టర్ కి ఇచ్చినట్టుగా వుంది.
అఖిల్ కేవలం తన బాడీ చూపించటానికి ఈ సినిమా చేసినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే అతని పాత్ర కన్నా, మమ్మూట్టి, డినో మోరీయా #DinoMorea పాత్రలో నిడివి పెద్దగా వున్నాయి.
స్క్రీన్ మీద పాటలు అసలు బాగోలేవు. అవి కంప్లీట్ మైనస్ సినిమాకి. అలాగే కథానాయకురాలు సాక్షి వైద్య #SakshiVaidya కేవలం పాటల కోసమే ఇందులో తీసుకున్నారు.
డినో మోరీయా పాత్ర అసలు ఏంటి, అతను మంచివాడే, చెడ్డవాడా, లేక మంచివాడిగా నటిస్తున్న చెడ్డవాడ, అసలు అతని పాత్ర డిజైన్ ఏమీ బాగోలేదు.
మెయిన్ కథలో బలం లేదు, దర్శకుడు సురేందర్ రెడ్డి ఒకదానికొకటి పొంతన లేకుండా ఈ సినిమా తీసాడు. భావోద్వేగాలు ఏమి లేవు, అలాగే అఖిల్ ఏజెంట్ అవటం కోసం పడే పాట్లు మరీ కామెడీగా వున్నాయి. లాజిక్ కూడా మిస్ అయింది.