Samatha: విజయవాడలో సమంత ఇడ్లి స్టాల్ పెట్టె పరిస్థితి రాలేదు

ABN , First Publish Date - 2023-08-16T11:06:41+05:30 IST

'ఖుషి' మ్యూజిక్ కన్సర్ట్ లో సమంత అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు, అలాగే ఆమె ఇదే ఈవెంట్ లో చాలా భావోద్వేగానికి కూడా గురై మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా వస్తాను అని చెప్పింది.

Samatha: విజయవాడలో సమంత ఇడ్లి స్టాల్ పెట్టె పరిస్థితి రాలేదు
Samantha and Vijay Deverakonda live performance at Khushi music concert

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన 'ఖుషి' #Khushi సినిమా సెప్టెంబర్ 1 న విడుదలవుతోంది. శివ నిర్వాణ (ShivaNirvana) దీనికి దర్శకుడు. నిన్న అంటే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ (KhushiMusicConcert) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాలో పాటలు లైవ్ లో పాడటమే కాకుండా ఒక పాటకి విజయ్ దేవరకొండ, సమంత డాన్స్ చేసి వచ్చిన అశేష ప్రేక్షక జనాలని ఉర్రూత లూగించారు. ఒక సినిమా ప్రచార చిత్రంలో భాగంగా చేసిన ఇలాంటి మ్యూజిక్ కన్సర్ట్ మొదటి సారిగా చేసినది అనే చెప్పాలి.

samantha-khushi2.jpg

ఇక ఈ ఈవెంట్ లో భాగంగా సమంత చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరూ చాలా ఓపిగ్గా తన కోసం ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పింది. మేము మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తాము, ఈ 'ఖుషీ' #Khushi సినిమా అలంటి మంచి సినిమా తీశామని నమ్ముతున్నాం అని చెప్పింది సమంత.

అలాగే ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ, కథానాయకుడు విజయ్ దేవరకొండ లను ఉద్దేశించి సమంత మాట్లాడుతూ, "దేవుడి దయవల్ల సమంత విజయవాడలో ఇడ్లీ స్టార్ పెట్టుకునే పరిస్థితి రాలేదు", అని చెప్పింది. అయితే ఈ మాటలు సమంత ఎందుకు చెప్పింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఈ మాటలు సినిమాలో ఉన్నాయా, లేక ఆమె పరిస్థితి బాగోలేక ఎవరైనా అన్నారా, సాంఘీక మాధ్యమంలో ఈ మాటలు వచ్చాయా అనే విషయం తెలీదు, కానీ ఆమె అన్న ఆ మాటలు మాత్రం వైరల్ అయ్యాయి. ఆలా అంటూనే, "టైముకు వచ్చి నేను సినిమా ఫినిష్ చేసేసాను" అని చెప్పింది.

samantha-khushi3.jpg

ఇంకా మాట్లాడుతూ, శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ ఇడ్లీ బిజనెస్ సరిగా చేస్తారో లేదో నాకు డౌట్ వుంది, కానీ వాళ్లిద్దరూ తీసే బ్లాక్ బస్టర్ సినిమా మీద అయితే అస్సలు డౌట్ లేదు అని చెప్పింది. అలాగే ఆమెని అర్థం చేసుకొని, సహకరించినందుకు ఆ చిత్ర యూనిట్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు చెప్పింది సమంత. చివర్లో చాలా భావోద్వేగానికి గురైన సమంత ఇక నుండి తాను చాలా కష్టపడి పని చేస్తాను, తిరిగి చాలా ఆరోగ్యంగా వస్తాను, (I will work hard and come back healthy and deliver a blockbuster film) బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తాను అంటూ చెప్పింది. మీ కోసం, మీ అందరి కోసం తిరిగి తప్పకుండా ఆరోగ్యంగా వస్తాను అని చెప్పింది సమంత.

Updated Date - 2023-08-16T11:06:41+05:30 IST