Devil: దర్శకత్వం అభిషేక్ నామా చేసుకున్నారు, నవీన్ పాత్ర ఏమీలేదు...

ABN , First Publish Date - 2023-09-12T14:17:24+05:30 IST

అభిషేక్ నామా నిర్మిస్తున్న 'డెవిల్' సినిమా పోస్టర్ నిన్న ఒకటి విడుదల చేశారు, అందులో దర్శకుడి పేరు బదులు ఏ ఫిలిం బై అభిషేక్ పిక్టర్స్ అని వేశారు. అయితే ఆలా ఎందుకు వేయాల్సి వచ్చింది, ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు అన్న విషయం నిర్మాత పీఆర్ టీము వివరణ ఇచ్చారు.

Devil: దర్శకత్వం అభిషేక్ నామా చేసుకున్నారు, నవీన్ పాత్ర ఏమీలేదు...
A still from Devil and producer Abhishek Nama

నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన 'డెవిల్' #Devil సినిమా దర్శకుడు నవీన్ (NaveenMedaram) పేరు ఆ సినిమా నిర్మాత అభిషేక్ నామా (AbhishekNama) వెయ్యలేదు అని అనే వార్తకి నిర్మాత స్పందించారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా ఇందులో కళ్యాణ్ రామ్ ఒక గూఢచారిగా కనపడనున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు కొంచెం వివాదంలో పడింది, ఈ సినిమా దర్శకుడి పేరు బదులు, ఎ ఫిలిం బై అభిషేక్ పిక్టర్స్ అని నిన్న పోస్టర్ విడుదల చేశారు.

అయితే ఎందుకు వెయ్యలేదు అన్నదానికి నిర్మాత పీఆర్ టీము వివరణ ఇచ్చారు. ఈ సినిమా మొదటి నుండీ కూడా నిర్మాత అభిషేక్ నామా అన్నీ తనే దగ్గరుండీ చూసుకున్నారు అని, మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే దర్శకుడు నవీన్ వేరే సినిమా ఆఫర్ రాగానే ఈ సినిమా వదిలేసి వెళ్ళిపోయాడు అని, అప్పటి నుండి ఈ సినిమా దర్శకత్వం అభిషేక్ నామా నే చేసుకుంటూ వచ్చారు అని చెప్పారు.

devil1.jpg

అయితే ముందు కొన్ని ప్రచార చిత్రాల్లో దర్శకుడు పేరు ఎందుకు వేశారు అన్న దానికి నవీన్ కొత్తవాడు, అతని కెరీర్ పాడవకూడదు అనే ఉద్దేశంతో అతను దర్శకత్వం చెయ్యకపోయినా అతని పేరు వేశామని, కానీ తరువాత అతను అసలు సెట్స్ కి కూడా రావటం మానేసాడు అని, మొత్తం పని అంతా అభిషేక్ చేసుకున్నారని, అందువలనే ఇప్పుడు నవీన్ పేరు దర్శకుడిగా తీసేసి అభిషేక్ పిక్టర్స్ అని పెట్టారు అని వివరించారు.

ఇదిలా ఉండగా, ఇందులో నటించిన కళ్యాణ్ రామ్ కూడా దర్శకుడి నవీన్ పట్ల అంతగా సుముఖంగా లేరని, అందుకే నిర్మాత అభిషేక్ రచయిత శ్రీకాంత్ విస్సాని (SrikanthVissa) కూడా ఈ కథలో భాగం చేశారని, అతను కథని ఆసక్తికరంగా తీసుకురావటంలో చాలా హెల్ప్ చేశాడని కూడా తెలిసింది. మొదటి షెడ్యూల్ వరకు మాత్రమే దర్శకుడు నవీన్ పని చేసాడని, తరువాత సినిమా అంత అభిషేక్ దర్శకత్వం చేసుకున్నాడు అని అందువలనే అతని పేరు తీసెయ్యాల్సి వచ్చింది అని తెలిసింది. ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధం అవుతోంది.

Updated Date - 2023-09-12T14:17:24+05:30 IST