Kotabommali PS: పోలీసులకు, రాజకీయనాయకుల మధ్య జరిగే సంఘర్షణలో ఎవరిది గెలుపు
ABN , First Publish Date - 2023-07-31T12:00:18+05:30 IST
నిర్మాత బన్నీ వాసు తమ GA2 పిక్చర్స్ బ్యానర్ మీద ఇంకో సినిమా విడుదలకి రెడీ చేశారు. ఈసారి మలయాళం సినిమా 'నయట్టు' ఆధారంగా తీసిన సినిమాకి 'కోటబొమ్మాళి పి ఎస్' అనే టైటిల్ పెట్టి, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
మలయాళం సినిమా 'నయట్టు' #Nayattu ఆధారంగా నిర్మాత బన్నీ వాసు (BunnyVasu) GA2 పిక్చర్స్ (GA2Pictures) మీద తెలుగులో తీస్తున్న సినిమాకి 'కోట బొమ్మాళి P.S' (KotabommaliPS) అని పేరు పెట్టారు. ఇందులో శ్రీకాంత్ మేక (SrikanthMeka), వరలక్ష్మి శరత్‌కుమార్ (VaralakshmiSarathKumar), రాహుల్ విజయ్ (RahulVijay), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar) ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. మలయాళం సినిమాలో రాజకీయాలకి, పోలీసులకి మధ్య జరిగే ఒక సంఘర్షణ లాంటి కథ. ఈ కథని తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా మార్చి గతంలో 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' చిత్రాలను రూపొందించిన తేజ మార్ని (TejaMarni) దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఇంకో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇంకో రెండు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ప్రకటించారు. చిత్రం కోసం "కోట బొమ్మాళి పి.ఎస్" అనే ఆసక్తిని రేకెత్తించే టైటిల్‌ని లాక్ చేసి, శ్రీకాంత్, రాహుల్ విజయ్ మరియు శివానీ రాజశేఖర్‌లను పోస్టర్ లో రివీల్ చేసారు.
GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళం సినిమాలో చాలా సంఘర్షణ ఉంటుంది. అందులో తమ రాజకీయ ప్రాబల్యం కోసం అవసరం అయితే పోలీసులను ఏ విధంగా వాడుకున్నారు, ఒక చిన్న సంఘటన ఎటువంటి సంఘర్షణకి దారితీసింది అనేది మలయాళం సినిమాలో బాగా చూపించారు. అయితే దీనిని తెలుగులో ఎంతవరకు మార్చి చూపించగలిగాడు అనేదే ఆసక్తికరం.
కోటబొమ్మాళి అనే వూరు శ్రీకాకుళం జిల్లాలో వుంది. ఈ సినిమా టైటిల్ కూడా అదే పేరుతో పెట్టి తీశారు. ప్రతీ పాత్రలోనే ఒక ఇంటెన్స్ ఉంటుంది. అయితే ముందుగా ఈ సినిమాని పెద్ద నటులతో అనుకున్నారు, కానీ తరువాత చిన్న బడ్జెట్ సినిమాగా తీశారని తెలిసింది. ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా వుంది. సినిమాల ఎలా ఉండబోతోందో చూడాలి.