Adipurush: మీసాల రాముడు అంటున్నారు... అప్పుడు అన్నమయ్యకు కూడా ఇలానే అన్నారు

ABN , First Publish Date - 2023-06-07T17:56:43+05:30 IST

మొదటి సారిగా వెండి తేర మీద రాముడిని మీసాల రాముడిగా కనిపిస్తున్నాడు ప్రభాస్ తన రాబోయే 'ఆదిపురుష్' సినిమాలో. అయితే అది చర్చగా కూడా సాగుతోంది. అప్పట్లో నాగార్జున నటించిన 'అన్నమయ్య' సినిమాకి కూడా ఇటువంటి చర్చే నడిచింది.

Adipurush: మీసాల రాముడు అంటున్నారు...  అప్పుడు అన్నమయ్యకు కూడా ఇలానే అన్నారు
Similarities about Annamayya and Adipurush

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా ఈనెల 16న విడుదల అవుతోంది. ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన, ఈ సినిమా రామాయణం #Ramayanam ఆధారంగా తీసినది. ఇందులో ఒక్కో పాత్ర పేరు ఒక వైవిధ్యంగా ఉండేట్టు పెట్టారు. ఇంతవరకు రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సినిమాలు చూస్తే సీతారాములు, రావణుడు, లక్ష్మణుడు, శూర్పణఖ ఇలా తెలుగువాళ్ళ నోళ్ళలో నానే పేర్లే వినపడేవి. కానీ ఈ 'ఆదిపురుష్' లో కొంచెము వైవిధ్యంగా ఉంటాయి. రామ అని కాకుండా రాఘవ్ అని, సీత కి బదులు జానకి అని, రావణ పేరుని లంకేశ్వర్ అని, లక్ష్మణుడిని శేష్ అని ఇలా పెట్టారు.

Adipurush-1.jpg

నార్త్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చెయ్యడానికి ఇలా పెట్టారా అంటే కాదు అని నిర్మాతల్లో ఒకరైన యూవీ క్రియేషన్స్ కి చెందిన విక్రమ్ రెడ్డి అన్నారు. ఇందులో వాటి పాత్రలను చూపించామని చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే మీసాలు పెట్టి, మీసాల రాముడిని చేసారు కదా అని అడిగితే, సినిమా చూస్తే ప్రేక్షకులకు అర్థం అవుతుంది, అందరికి నచ్చుతుంది అని చెప్పారు.

ఇంతవరకు వచ్చిన పౌరాణిక సినిమాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎక్కడా మీసాలు పెట్టినట్టు లేదు. ఇప్పుడు ఈ 'ఆదిపురుష్' #Adipurush లో మాత్రం ప్రభాస్ #Prabhas మీసాలతో కనిపించనున్నాడు. అయితే అప్పట్లో 'అన్నమయ్య' #Annamayya సినిమా అప్పుడు నాగార్జున (Akkineni Nagarjuna) ఆ పాత్ర చేసినప్పుడు ఇదే చర్చ జరిగింది. అన్నమయ్య కి మీసాలు ఉంటాయా అని, వుండవు అని ఇలా చర్చ జరిగినప్పుడు మీసాలు ఎందుకు వుండకూడదు అని నాగార్జున మీసాలతో నటించాడు. కె రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) దర్శకత్వం వహించిన ఆ సినిమా హిట్ అయింది కూడా. అందువల్ల రాముడికి కూడా మీసాలు ఉంటే తప్పులేదు అని అంటున్నారు.

Adipurush1.jpg

అలాగే ఈ సినిమా మోషన్ కేప్చర్, యానిమేషన్, ఇంకా రెగ్యులర్ పాత్రలతో పాటలు, సన్నివేశాలు ఇలా చిత్రీకరించారు. దానికి కూడా విక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మోషన్ కేప్చర్ ని ఉపయోగించారు, అలాగే పాటల్లో, మిగతా సన్నివేశాల్లో మామూలుగా సినిమాల్లో వుండేట్టుగానే షూటింగ్ చేసి చేశారు అని చెప్పారు. సినిమాలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని అవన్నీ మోషన్ కేప్చర్ లో చేశారని చెప్తున్నారు విక్రమ్. మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలు చూసే వాళ్లందరికీ ఈ 'ఆదిపురుష్' విపరీతంగా నచ్చుతుంది అని చెపుతున్నారు విక్రమ్.

adipurush.jpg

అయితే సినిమా ఇంకొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది, ప్రభాస్ కూడా ఈ సినిమాకి చాలా పెద్దగా ప్రచారం చేసాడు, అసలు కూడా పెట్టుకున్నారు, మరి చూడాలి మీసాల రాముడు పాత్రలో ప్రేక్షకులు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో.

Updated Date - 2023-06-07T18:02:14+05:30 IST