Prabhas - Salaar : అదే నిజమైతే మళ్లీ నిరాశే...

ABN , First Publish Date - 2023-09-03T12:56:21+05:30 IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న భారీయాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు తెలస్తోంది.

Prabhas  - Salaar : అదే నిజమైతే మళ్లీ నిరాశే...

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా (Prabhas)నటించిన చిత్రం ‘సలార్‌’. (salaar) ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel) దర్శకత్వం వహిస్తున్న భారీయాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు తెలస్తోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగ వెల్లడించకపోయిన వాయిదా విషయంలో టాక్‌ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌ ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘సలార్‌ సెప్టెంబర్‌ 28న విడుదల కావట్లేదు. నవంబర్‌లో విడుదలకు సిద్దమవుతోంది ఇది అఫీషియల్‌. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. హోంబలే సంస్థ నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తారు’’ అని తరుణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే నిజమైతే ప్రభాస్‌ అభిమానులకు నిరాశే. మరో రెండు నెలలపాటు ఎదురుచూడాల్సిందే!

‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ తన తర్వాతి మూడు చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ చిత్రాలు వసూళ్లు రాబట్టాయి కానీ అభిమానులను సంతృప్తి పరచలేకపోయాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి, అంచనాలన్నీ ‘సలార్‌’పైనే ఉన్నాయి. ప్రభాస్‌ సరసన శ్రుతీహాసన్‌ నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడి కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-09-03T13:18:36+05:30 IST