Jr Ntr: ఓన్లీ హగ్గులేనా... పార్టీ లేదా పుష్ప..

ABN , First Publish Date - 2023-04-09T09:40:46+05:30 IST

వెరీ హ్యాపీ బర్త్‌డే బావా! గ్రేట్‌ డే... థ్యాంక్యూ బావా... నీకు నా హగ్గులు... ఓన్లీ హగ్గులేనా... పార్టీ లేదా పుష్ప..

Jr Ntr: ఓన్లీ హగ్గులేనా... పార్టీ లేదా పుష్ప..

వెరీ హ్యాపీ బర్త్‌డే బావా! గ్రేట్‌ డే... (Happy birthday bava)

థ్యాంక్యూ బావా... నీకు నా హగ్గులు...

ఓన్లీ హగ్గులేనా... పార్టీ లేదా పుష్ప... (party leda pushpa)

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న సంభాషణ ఇది. శనివారం అల్లు అర్జున్‌ (Allu arjun) పుట్టినరోజు సందర్భంగా యంగ్‌ టైగర్‌ (Ntr) ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ చాట్‌ లో ‘బావ’ (Bava) అనే పదం ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి చేరింది. శనివారం అల్లు అర్జున్‌ 41వ పుట్టినరోజు వేడుకను నిర్వహించుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నుంచి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి శుభాకాంక్షలు వెల్తువెత్తాయి. జూ.ఎన్టీఆర్‌ సైతం విషెస్‌ చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బావ(happy birthday Bava). ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీనికి అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. ‘‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్‌..’’ అని రిప్లై ఇచ్చారు. దీనిపై ఎన్టీఆర్‌ సమాధానమిస్తూ ‘‘హగ్స్‌ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?’’ అంటూ స్మైలీ ఎమోజీని జోడించారు. చేశారు. దీనికి (అల్లు అర్జున్‌).. ‘వస్తున్నా’ అని కన్నుగీటారు. బావా.. బావా అనుకుంటూ వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూసి నెటిజన్లు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1.jpg

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టీజర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అత్యధిక మంది వీక్షించిన తెలుగు టీజర్‌లతో ఇది మూడో స్థానంలో ఉందని చిత్ర బృందం తెలిపింది. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక, ఎన్టీఆర్‌ విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌30’ (Ntr30)చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్‌ మొదలైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.

Updated Date - 2023-04-09T09:43:26+05:30 IST