Surekha Vani: నిరాధార ఆరోపణలు మానండి.. చాలా ఎఫెక్ట్‌ అవుతున్నాం!

ABN , First Publish Date - 2023-06-25T17:56:51+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్‌ కేసు మరోసారి కలకలం రేపింది. నిర్మాత కేపీ చౌదరిని మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన ఫోన్‌ డేటా, ఫొటోలను బట్టి పలువురు నటీమణుల పేర్లు బయటపడ్డాయి. దీనిపై సురేఖావాణి స్వయంగా స్పందించింది. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోతో తెలిపారు.

Surekha Vani: నిరాధార ఆరోపణలు మానండి.. చాలా ఎఫెక్ట్‌ అవుతున్నాం!

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్‌ కేసు (Drug case) మరోసారి కలకలం రేపింది. నిర్మాత కేపీ చౌదరిని (Kp Chowdary)మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన ఫోన్‌ డేటా, ఫొటోలను బట్టి పలువురు నటీమణుల పేర్లు బయటపడ్డాయి. అందులో అషురెడ్డి, జ్యోతి, సురేఖావాణి తదితరులు పేర్తు ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటికే అషురెడ్డి, జ్యోతి క్లారిటీ ఇచ్చారు. ఈ జాబితాలో నటి సురేఖావాణిపై ప్రముఖంగా ఆరోపణలు వచ్చాయి. ఆమె డ్రగ్స్‌ తీసుకుందనే రూమర్స్‌ వినిపించాయి. అలాగే కేపీ చౌదరి బుగ్గపై సురేఖావాణి (Surekha Vani) ముద్దు పెడుతున్న ఫొటో వైరల్‌ కావడంతో మద్యం, డ్రగ్స్‌ మత్తులో ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై ఆమె స్వయంగా స్పందించింది. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోతో తెలిపారు.

‘‘కొద్ది రోజులుగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయ చేసి మాపై ఆరోపణలు చేయడం మానండి. నిజానిజాలు తెలియకుండా చేసే ఆరోపణల వల్ల నా కెరీర్‌, పిల్లల కెరీర్‌, నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్‌ అవుతున్నాం. ప్లీజ్‌ అర్థం చేసుకోండి. దయచేసిన మమ్మల్ని వదిలేయండి’’ అని సురేఖావాణి ఈ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - 2023-06-25T18:01:10+05:30 IST