Sunil Gavaskar- Natu natu: ఇది ప్రారంభం మాత్రమే.. క్రికెట్ స్టేడియంలోనూ అదే ఫీవర్!
ABN , First Publish Date - 2023-03-14T14:42:23+05:30 IST
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘నాటు నాటు’ ఫీవర్ కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అందుకుని తెలుగు సినిమా సత్తా చాటిందీ పాట.
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘నాటు నాటు’ ఫీవర్ (Natu Natu Fever) కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అందుకుని తెలుగు సినిమా సత్తా చాటిందీ పాట. మాధ్యమం, వేదిక ఏదైనా వినిపించే పాట మాత్రం ‘నాటు నాటు’నే. ఇదే ఫీవర్ ఇప్పుడు క్రికెట్ స్టేడియంకు (Natu natu Fever at Cricket stadium) కూడా పాకింది. ఈ పాటకు క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు. తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఈ పాటకు స్టెప్ వేసిన జాబితాలో చేశారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు ‘నాటు నాటు’ పాట గురించి ఓ క్రీడా ఛానల్‌తో సునీల్ గావస్కర్ (Sunil Gavaskar about Natu natu) మాట్లాడారు. ‘‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడం ఎంతో సంతోషంగా ఉంప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు అభినందనలు. ఈ చిత్రం నేనూ చూశా. ఎంతో నచ్చింది’’ అని అన్నారు. ఆ పాటకు స్టెప్పులేసి ఉత్సాహాన్ని చాటారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (Sunil Gavaskar dance for Natu natu)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)చిత్రంలోని ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే!