Sunil: ‘భువన విజయమ్‌’ విడుదల ఖరారు!

ABN , First Publish Date - 2023-04-29T18:07:43+05:30 IST

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, విఎస్‌కె నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్‌’.

Sunil: ‘భువన విజయమ్‌’ విడుదల ఖరారు!

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రఽధాన పాత్రలో నూతన దర్శకుడు యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, విఎస్‌కె నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్‌’. శనివారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, పోస్టర్‌లకు చక్కని స్పందన వస్తోంది.

ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు..

ఒక ప్రొడ్యూసర్‌.. తనకి జాతకాల పిచ్చి..

ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు..

సచ్చికూడా ఇంకా మనుషులు మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ...

చావుబతుకుల మధ్య ఉన్న కూతురుని బతికించుకోవడానికి ఓ తండ్రి పడే వేదన..

పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు (Bhuvana vijayam Teaser)

నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’ అంటూ సాగిన వాయిస్‌తో ఆసక్తికరంగా సాగింది టీజర్‌.

అంటూ సాగిన టీజర్‌ ఆసక్తి రేకెత్తించింది. పూర్తి వినోదాత్మకంగా సాగే థ్రిల్లర్‌ ఇది. శేఖర్‌ చంద్ర సంగీతం సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది’’ అని దర్శకుడు చెప్పారు.

Updated Date - 2023-04-29T18:07:43+05:30 IST