Sukumar -Thabita: లెక్కల మాస్టర్ తరహాలోనే.. లెక్కలేసింది
ABN , First Publish Date - 2023-06-12T13:42:26+05:30 IST
168 నెలల ప్రేమ.. 730 వారాల ఆనందం.. 5113 రోజుల విధేయత.. 122721 గంటల అర్థం చేసుకునే తత్వం - అవగాహన.. 7363288 నిమిషాల పట్టుదల.. 441797328 సెకన్ల నిరంతర నిబద్థత.. వెరసి 14 ఏళ్ల వైవాహిక జీవితం. ఇది లెక్కల మాస్టర్ సుకుమార్ భార్య.. పెళ్లి రోజు సందర్భంగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్.
168 నెలల ప్రేమ..
730 వారాల ఆనందం..
5113 రోజుల విధేయత..
122721 గంటల అర్థం చేసుకునే తత్వం - అవగాహన..
7363288 నిమిషాల పట్టుదల..
441797328 సెకన్ల నిరంతర నిబద్థత..
వెరసి 14 ఏళ్ల వైవాహిక జీవితం.
ఇది లెక్కల మాస్టర్ సుకుమార్ భార్య.. పెళ్లి రోజు సందర్భంగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్. (Sukumarthabita Wedding Anniversary)
సహనం, స్థిరత్వం, గౌరవాన్ని ప్రతిబింబించేలా మా మధ్య ఉన్న శాశ్వత ప్రేమకు ప్రతీక మా 14 సంవత్సరాల వైవాహిక జీవితం. ‘మనం నిర్మించుకున్న ఈ జీవితమంటే ఎంతో ఇష్టం. పిల్లలు, కుటుంబం ఇలా మనం సృష్టించుకున్న ప్రతి దానిని ప్రేమిస్తుంటాను. మీ కన్నా అందంగా, ప్యాషన్‌గా ఇదంతా నేను తీర్చిదిద్దలేనేమో. అందుకే 'యు ఆర్ ద బెస్ట్'. నా జీవితంలో బెస్ట్ పార్ట్నర్గా, సహచరుడిగా, స్నేహితుడిగా నా పక్కనే ఉండడంతో నా జీవితం సంపూర్ణంగా ఉంది. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు సుకుమార్ భార్య తబిత.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘లెక్కల మాస్టర్ తరహాలోనే లెక్కల్లోనే తన ప్రేమను, 14 ఏళ్ల వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది’ అని కామెంట్లు చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్, తబితలది ప్రేమ వివాహం. వీరి వైవాహిక జీవితాన్ని 14 ఏళ్లు. ఇలాగే ఎన్నో వసంతాలు ఆనందంగా ఉండాలని నెటిజన్లు ఆకాంక్షిస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రస్తుతం సుకుమార్ (Sukumar) ‘పుష్ప-2’ (Pushpa2) చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మొదటిపార్ట్కు ఏమాత్రం తగ్గకుండా ‘తగ్గేదేలే’ అన్నట్లు ఈ చిత్రాన్ని రూపొందించడానికి సుక్కూ అండ్ టీమ్ శాయశక్తుల కృషి చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.