Pushpa 2: షూటింగ్ అప్పుడే ఇది కూడా...

ABN , First Publish Date - 2023-03-11T15:19:40+05:30 IST

'పుష్ప 2' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఒక ప్రభుత్వ ఆఫీస్ లో జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇంకొకటి కూడా రికార్డు చేసేసుకుంటున్నాడు....

Pushpa 2: షూటింగ్ అప్పుడే ఇది కూడా...

దర్శకుడు సుకుమార్ (Director Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' (Pushpa) గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రెండో పార్టు 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ జరుగుతూ వుంది. దీనిలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) , రావు రమేష్ (Rao Ramesh), జగపతి బాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya) లు విలన్ గా ఉంటారని, వీళ్లందరినీ పుష్ప ఎలా తలపడతాడో ఈ పార్టు 2 లో చూడాలని అంటున్నారు. బ్రహ్మాజీ (Brahmaji) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో ఈ రెండో దానిలో కనపడతాడు అని కూడా అంటున్నారు.

rashmikamandanna1.jpg

అయితే దర్శకుడు సుకుమార్ ఏమి చేస్తున్నాడో తెలుసా, సింక్ సౌండ్ ఉపయోగిస్తున్నాడు. అప్పట్లో అంటే బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు తీసేటప్పుడు ఈ సింక్ సౌండ్ ని ఉపయోగించే వారు. సింక్ సౌండ్ అంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరి పాత్రలో వాళ్ళు వాళ్ళ డైలాగ్స్ చెపుతున్నప్పుడే రికార్డు చేసుకోవటం. అంటే ఇంకా మళ్ళీ స్పెషల్ గా డబ్బింగ్ చెప్పడానికి ఆ ఆర్టిస్టు రానవసరం లేదు, ఏదైనా డైలాగు కొంచెం వినపడకపోతే తప్ప. ఆమధ్యలో కొందరు ఇలా సింక్ సౌండ్ లో రికార్డింగ్ చేశారు కూడా. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) సినిమా కూడా ఇలా సింక్ సౌండ్ లో దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhasckar) రికార్డు చేసాడు.

ఇప్పుడు సుకుమార్ కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఈ సింక్ సౌండ్ వలన షూటింగ్ లో నటుడు ఎంత భావోద్వేగం తో చెప్పాడో, అలాగే లైవ్ లో డైలాగ్ ఎలా చెప్పాడో అది రికార్డు అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అందుకని సుకుమార్ ఈ సినిమాకి సింక్ సౌండ్ ఉపయోగించాడు అని తెలిసింది. మొదటి పార్టు కూడా ఇలానే చేసాడు అని అంటున్నారు. ప్రతి నటుడి దుస్తుల్లో ఒక చిన్న మైక్ పెట్టేసాడట, అది వాళ్ళు మాట్లాడిన డైలాగ్స్ బాగా రికార్డు చేసేస్తుంది అని చెప్తున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది.

Updated Date - 2023-03-11T15:19:42+05:30 IST