Sukumar: ఆ కుర్చీ మీదే.. రాజమౌళి!

ABN , First Publish Date - 2023-01-25T17:56:06+05:30 IST

సుకుమార్‌ ఏం చేసిన క్రేజీగా ఉంటుంది. లెక్కల మాస్టర్‌ ఆలోచనలు ఒకింత వైవిధ్యంగా ఉంటాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని మాస్‌ బీట్‌ సాంగ్‌ ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సందర్భంగా సుకుమార్‌ సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పారు.

Sukumar: ఆ కుర్చీ మీదే.. రాజమౌళి!

సుకుమార్‌(sukumar) ఏం చేసిన క్రేజీగా ఉంటుంది. లెక్కల మాస్టర్‌ ఆలోచనలు ఒకింత వైవిధ్యంగా ఉంటాయి. రాజమౌళి (rajamouli)దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని మాస్‌ బీట్‌ సాంగ్‌ ‘నాటు నాటు’ (natu natu oscar)ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సందర్భంగా సుకుమార్‌ సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పారు. తన సాంకేతిక సిబ్బందితో సిట్టింగ్‌ వేసి ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ‘నా టీమ్‌ మీటింగ్‌లు, డిస్కషన్స్‌ అన్నీ ఇన్నాళ్లూ ప్రిన్సిపల్‌ కుర్చీని అసంకల్పితంగా ఖాళీగా వదిలేశాను. అలా ఎందుకు చేశానో ఇప్పుడు అర్థం చేసుకున్నాను. రాజమౌళి సార్‌ ఇది మీకోసమే! ఈ కుర్చీ ఎప్పుడూ మీకు చెందినదే. భవిష్యత్తుల్లో కూడా ఇలాగే ఉంటుంది’’ అని సుకుమార్‌ అన్నారు. సినిమా టీమ్‌ రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైౖరవ, ప్రేమ్‌రక్షిత్‌ ఇతర సినిమా టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో వైజాగ్‌లో ఉన్నారు. (sukumar wishes to RRR team)

Updated Date - 2023-01-25T17:56:08+05:30 IST