Sudheer Varma: దాచింది బయటకు వస్తాదనే భయంతో.. అలా చేశాం!

ABN , First Publish Date - 2023-04-04T20:02:00+05:30 IST

‘‘రావణాసుర’ సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసే సూపర్‌ ఎగ్జైటెడ్‌ సినిమా. ఇందులో థ్రిల్‌, షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ప్రత్యేక ఆకర్షణ. ఇంతకు మించి చెబితే సినిమా కిక్‌ని ఆస్వాదించలేరు’’

Sudheer Varma: దాచింది బయటకు వస్తాదనే భయంతో.. అలా చేశాం!

‘‘రావణాసుర’ (Ravanasura) సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసే సూపర్‌ ఎగ్జైటెడ్‌ సినిమా. ఇందులో థ్రిల్‌, Thrilling) షాకింగ్‌ ఎలిమెంట్స్‌ (shocking elements) ప్రత్యేక ఆకర్షణ. ఇంతకు మించి చెబితే సినిమా కిక్‌ని ఆస్వాదించలేరు’’ అని దర్శకుడు సుధీర్‌వర్మ(Sudheer Varma) అన్నారు.

రవితేజ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మాతలు. అనూ ఇమ్మాన్యుయేల్‌(Anu emmenuel), ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌(Megha Akash), దక్షా నగార్కర్‌, పూజితా పొన్నాడ నాయికలు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా సుధీర్‌వర్మ విలేకర్లతో మాట్లాడారు.

ఇలాంటి కథ నేను డైరెక్ట్‌ చేస్తే బావుంటుందని రచయిత శ్రీకాంత్‌ను నా దగ్గరికి పంపారు రవితేజ. ఆయనలాంటి హీరో ఇలాంటి థ్రిల్లర్‌ చేయాలనుకోవడం నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ‘రావణాసుర’ వంద శాతం కొత్త జోనర్‌ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదని నమ్ముతున్నా. చాలామంది గ్రే షేడ్‌ ఉన్న పాత్ర అని అంటున్నారు. తెలుగు సినిమాకు గ్రే షేడ్‌ కొత్తేమీ కాదు. ‘అంతం’లో నాగార్జున, సత్యలో జేడీ ఇవన్నీ గ్రే పాత్రలే. ఈ మధ్య వచ్చినవి కాదు. తెరపై ఎక్కువమంది ఆర్టిస్ట్‌లు కనిపిస్తారు. వీరంతా ఏం చేస్తారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలగాలి. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. సర్‌ప్రైజ్‌, షాక్‌, థ్రిల్‌ మూడు ఉన్న చిత్రమిది. ఇది కంప్లీట్‌ రవితేజ ప్యాకేజ్‌ సినిమా. ఆయన పని, నటన గురించి అందరికీ తెలిసిందే! నటన పరంగా ఆయన నటించిన టాప్‌ 3 సినిమాల్లో ఈ సినిమా ఉంటుంది.

సవాల్‌గా ఉంది... (Sudheer Varma Interview)

వేరే రచయిత రాసిన కథను డైరెక్ట్‌ చేయడం సవాల్‌తో కూడిన పనే. నా కథ అయితే నా విజువల్‌ సెన్సిబిలిటీకి తగట్టు రాసుకుంటాను. ఏదైనా మార్పు చేయడం కూడా సులువుగా ఉంటుంది. వేరే కథలో మార్పు చేసినప్పుడు ఆ మార్పు మిగతా ఏరియాల్లో ఎంత ఎఫెక్ట్‌ చూపిస్తుందనేది రచయితతో కూర్చుని క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి.

టెన్షన్‌ ఉంటుంది...

నా సినిమా ఎప్పుడు వచ్చినా హిట్‌ ఇవ్వాలనే టెన్షన్‌ ఉంటుంది. యూనివర్సెల్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ కావడంతో తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయాలనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్‌ బయటికి వచ్చేస్తాయనే భయంతో మొదట తెలుగులోనే విడుదల చేయాలనుకుంటున్నాం. రెండోవారంలో హిందీ విడుదల ప్లాన్‌ చేస్తున్నాం.

Updated Date - 2023-04-04T20:02:01+05:30 IST