Sudha kongara: చిరాకుగా.. బాధగా ఉంది.. ఇది ఊహించలేదు!
ABN , First Publish Date - 2023-02-05T19:20:25+05:30 IST
‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల దర్శకురాలు సుధా కొంగరకు చిన్నపాటి ప్రమాదం జరిగింది. షూటింగ్ సెట్లో ఆమె గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియచేశారామె. చేతికట్టుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుధా.
‘గురు’(Guru), ‘ఆకాశమే నీ హద్దురా’(aakasame nee haddura) చిత్రాల దర్శకురాలు సుధా కొంగరకు (Sudha kongara) చిన్నపాటి ప్రమాదం జరిగింది. షూటింగ్ సెట్లో ఆమె గాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియచేశారామె. చేతికట్టుతో ఉన్న (sudha kongara injured) ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుధా. ‘‘చాలా చిరాకుగా, బాధగా ఉంది. ఈ దెబ్బ కారణంగా నెలరోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. షూటింగ్కు ఇలాంటి బ్రేక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకుని సెట్లో అడుగుపెట్టాలని అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. సూర్యతో తీసిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో ఆమె నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే!
ప్రస్తుతం సుధా కొంగర హీరో అక్షయ్ కుమార్తో (akshay kumar)సూరారై పోట్రు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అంతే కాదు ఆమె ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారని ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటికే ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.