SSMB29: రాజమౌళి ఎలా ప్లాన్‌ చేశారంటే... ఎనిమిదేళ్లు పక్కా!

ABN , First Publish Date - 2023-04-11T12:23:33+05:30 IST

మహేశ్‌బాబు(Maheshbabu)-రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రానున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) కు సంబంధించి వస్తున్న ప్రతి వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.

SSMB29: రాజమౌళి ఎలా ప్లాన్‌ చేశారంటే... ఎనిమిదేళ్లు పక్కా!

మహేశ్‌బాబు(Maheshbabu)-రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రానున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) కు సంబంధించి వస్తున్న ప్రతి వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త ట్రెండింగ్‌లో ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే భారీతనం, తక్కువలో తక్కువ రెండున్నర సంవత్సరాలు. ఆయనతో సినిమా కమిట్‌ అయిన ఏ హీరో అయిన ఆ మాత్రం డేట్స్‌ ఇచ్చేయాల్సిందే. అంత పర్‌ఫెక్షనిస్ట్‌ ఆయన. కథ మీద వర్క్‌ మొదలుపెట్టినప్పటి నుంచి కాపీ రెడీ అయ్యి తెరపైకి వచ్చే వరకూ ది బెస్ట్‌ అవుట్‌ కోసం కృషి చేస్తూనే ఉంటారు జక్కన్న. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌తో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ ప్లాన్‌ చేశారు రాజమౌళి. ఈ కథకు ఫ్రాంచైజ్‌ ఉంటుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త ట్రెండ్‌ అవుతోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29ను మూడు పార్టులుగా (SSMB29 trilogy) రాజమౌళి తెరకెక్కించనున్నారని, ప్రస్తుతం ఆ సన్నాహాల్లో ఆయన ఉన్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు, సాంకేతిక నిపుణులను భాగం చేయనున్నారని సమాచారం. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసి రాజమౌళి ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. (SSMB 29, 30, 31 With Rajamouli)

దీన్ని బట్టి చూస్తే ఎస్‌ఎస్‌ఎంబీ 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న ఎనిమిదేళ్లలో ఈ పార్టులు విడుదలవుతాయని, అభిమానులకు పండగేనని చెబుతున్నారు. మూడు పార్టులకు ఎనిమిదేళ్లు అంటే మహేశ్‌ వేరే కమిట్‌మెంట్‌లను ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ హడావిడి నుంచి ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నారు రాజమౌళి. ఆయన సినిమా అంటే కనీసం ఆరు నెలలపాటు ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు. ఇప్పటికే ఆయన ఈ చిత్రానికి సంబంధించి వీఎఫ్‌ఎక్స్‌ తదితర వర్క్‌షాప్‌ మొదలుపెట్టారట. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని సమాచారం.

Updated Date - 2023-04-11T12:24:15+05:30 IST