Thaman Fire: నాకు చాలా పనులున్నాయి... డిస్టర్బ్‌ చేయకండి!

ABN , First Publish Date - 2023-06-20T14:39:36+05:30 IST

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ బయటికొచ్చేశారనే వార్త నెట్టింట కొడుతున్న సంగతి తెలిసిందే! మహేశ్‌తో తమన్‌తో విభేదాలున్నాయని అందుకే త్రివిక్రమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూమర్‌ వచ్చిన గంటలోపే తమన్‌ ట్వీట్‌తో సమాధానం చెప్పారు.

Thaman Fire:  నాకు చాలా పనులున్నాయి... డిస్టర్బ్‌ చేయకండి!

మహేశ్‌బాబు(Maheshbabu) హీరోగా త్రివిక్రమ్‌ (trivikram)దర్శకత్వంలో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ (guntur karam) చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ బయటికొచ్చేశారనే వార్త నెట్టింట కొడుతున్న సంగతి తెలిసిందే! మహేశ్‌తో తమన్‌తో విభేదాలున్నాయని అందుకే త్రివిక్రమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూమర్‌ వచ్చిన గంటలోపే తమన్‌ ట్వీట్‌తో సమాధానం చెప్పారు. వెటకారంగా పెట్టిన తమన్‌ ట్వీట్‌ ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

‘‘ఇక నుంచి నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్‌ ప్రారంభిస్తున్నా. కడుపు మంట లక్షణాలతో బాధపడుతున్న వారు వచ్చి తాగండి. కడుపు మంటను తగ్గించుకోండి. ఇక్కడ బటర్‌మిల్క్‌ పూర్తిగా ఉచితం. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి. నాకు చాలా పనులు ఉన్నాయి’’ అంటూ ట్రోలర్స్‌కి గట్టి ఝలక్‌ ఇచ్చారు తమన్‌. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ చిత్రం నుంచి ఆయన్ని తొలగించారనే రూమర్స్‌ విని తమన్‌ ఇలా స్పందించారిన నెటిజన్లు చెప్పుకుంటున్నారు. కడుపు మంట ఉన్నవారే ఇలాంటి రూమర్స్‌ స్ర్పెడ్‌ చేస్తారని, వాళ్లకు తనకు ఇచ్చే సలహా ఇదే తమన్‌ ఈ ట్వీట్‌ చేశారని చెబుతున్నారు. కొందరు అయితే ‘ఏమైంది బ్రో’ అని కామెంట్లు పెడుతుంటే ‘ట్రోలర్స్‌ మీద వేసిన కౌంటర్స్‌ చాలు. అప్డేట్‌ ఇచ్చేది ఏమైనా ఉందా? అని కామెంట్స్‌ పెడుతున్నారు.

123.jpg

మరోవైపు తమన్‌ ఎస్‌ఎస్‌ఎంబీ 28(SSMB28) చిత్రానికి పని చేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోలేదని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నెల 24 నుంచి షూటింగ్‌ మొదలవుతుందని ఫ్యాన్స్‌ పేజీల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. మహేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-06-20T14:47:50+05:30 IST